తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న మంచు విష్ణు ప్రస్తుతం నటుడిగా మాత్రమే కాకుండా మా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో మంచు కుటుంబం పట్ల సోషల్ మీడియా వేదికగా దారుణమైన ట్రోలింగ్స్ వస్తూనే ఉన్నాయి.
అయితే ఇలా తమ ఫ్యామిలీ గురించి ట్రోలింగ్ చేసిన వారి పట్ల ఇప్పటికే ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చినప్పటికీ నేటిజన్స్ తమ పంతాను మాత్రం వీడటం లేదు.
ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మంచు విష్ణు ఏదో ఒక విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ కొన్నిసార్లు నేటిజన్ ల ట్రోలింగుకు గురవుతూ ఉంటారు.
అయితే తాజాగా ఈయన విమానంలో ప్రయాణిస్తూ అక్కడ జరిగిన ఒక సంఘటనను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.ఇంతకీ ఏం జరిగిందని విషయానికి వస్తే ఈయన లాస్ ఏంజెల్స్ నుంచి ఇండియాకి ఫ్లైట్ లో బయలుదేరారు.
మధ్యలో లండన్ లో ఇంకో విమానం మారాల్సి ఉంది.

లాస్ ఏంజిల్స్ ఎయిర్పోర్ట్ లో విమానం ఎక్కుతుండగా ఓ వ్యక్తి హడావిడిగా వచ్చివాష్రూమ్ లోకి వెళ్లి సిగరెట్ తాగారు.దీంతో తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో విమానయాన సిబ్బంది వచ్చి అందరిని కిందకు దింపి మరోసారి తనకి చేసి ఫ్లైట్ ఎక్కించారు.ఆ వ్యక్తి అలా చేయడంతో మంచు విష్ణుకు ఆ వ్యక్తి పై చిర్రెత్తుకొచ్చిందట.‘అసలు ఫ్లైట్ టేక్ ఆఫ్ కాకుండా సిగరెట్ తాగడం ఏంటి, ఇదేం జారుమిఠాయి రా బాబు.తాను లండన్ లో మరో ఫ్లైట్ అందుకోగలనా లేదా చూడాలి అంటూ ఫ్లైట్ లో జరిగిన సంఘటన గురించి ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో నేటిజన్స్ ఈ వీడియో పై పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.







