శోభన్ బాబు టైటిల్ తో గోపీచంద్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు గోపీచంద్.

 Gopichand New Movie Title Is Ramabhanam, Gopichand, New Movie, Unstoppble Show,-TeluguStop.com

ఇక చివరిగా గోపీచంద్ సిటీ మార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే గోపీచంద్ ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

పీపుల్స్ మీడియా పథకం పై కూచిబొట్ల వివేక్ టీ.జీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రివిల్ చేశారు హీరో గోపీచంద్.

తాజాగా గోపీచంద్ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలోనే తన కొత్త సినిమా టైటిల్ ని రివిల్ చేశారు హీరో గోపీచంద్.శోభన్ బాబు సినిమా టైటిల్ ని తన సినిమా టైటిల్ గా పెట్టినట్లు తెలిపాడు.

గోపీచంద్ తదుపరి సినిమాకు రామబాణం అనే టైటిల్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.ఇదే టైటిల్ తో గతంలో శోభన్ బాబు హీరోగా నటించిన ఒక సినిమా విడుదలైన విషయం తెలిసిందే.

ఇకపోతే గోపీచంద్ సినిమా విషయానికి వస్తే ఇందులో గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కూడా కీలకపాత్రలో కనిపించనుంది.

కాగా ఇప్పటికే శ్రీవాస్ గోపీచంద్ కాంబినేషన్లో లక్ష్యం,లౌక్యం వంటి సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలు విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.కాగా తన తదుపరి సినిమా రామబాణం సినిమాతో మంచి హ్యాట్రిక్ హిట్టు కొట్టాలి అన్న ధ్యేయంతో ముందుకు సాగుతున్నాడు గోపీచంద్.తాజాగా బాలయ్య బాబు షోలో ప్రభాస్, గోపీచంద్ ఇద్దరు కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే గోపీచంద్ తన సినిమా టైటిల్ ని రివిల్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube