తమిళనాడు మంత్రిగా ఉదయనిధి స్టాలిన్​.. ఈనెల 14న ప్రమాణ స్వీకారం

తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్‌ మంత్రివర్గంలోకి అడుగు పెట్టబోతున్నారు.ఏడాదిగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయన త్వరలోనే మంత్రి పదవి చేపట్టనున్నారు.

 Udayanidhi Stalin As Minister Of Tamil Nadu.. Will Take Oath On 14th Of This Mon-TeluguStop.com

దీంతో తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మార్పు జరగనుంది.చెపాక్‌-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి 2021లో విజయం సాధించిన ఉదయ నిధి స్టాలిన్‌ ఏడాదిగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ప్రస్తుతానికి ఎలాంటి ప్రభుత్వ పదవిలోనూ లేరు.ఈ నేపథ్యంలోనే ఆయనను త్వరలోనే మంత్రి వర్గంలోకి తీసుకోనున్నారు.

డిసెంబర్‌ 14న ఆయన మంత్రివర్గంలోకి చేరుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఉదయనిధి స్టాలిన్‌ను తీసుకోవడంతో పాటు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ కూడా జరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

అయితే యువతను ఆకట్టుకునే కీలక విభాగానికి ఉదయనిధిని మంత్రిని చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.దీనిబట్టి ఉదయనిధికి యువజన, క్రీడా మంత్రిత్వశాఖ బాధ్యతలు అప్పగిస్తారని అంచనా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube