వెల్లుల్లిదీని గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.నిత్యం వంటల్లో వెల్లుల్లిని వాడుతూనే ఉంటారు.
వంటలకు చక్కని రుచి మరియు సువాసన అందించే వెల్లుల్లిలో బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అలాగే చర్మ సౌందర్యానికి సైతం ఉపయోగపడతాయి.ముఖ్యంగా వెల్లుల్లితో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు.
పైగా మరిన్ని ప్రయోజనాలను సైతం తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం వెల్లుల్లిని ఉపయోగించి మచ్చలేని ముఖ చర్మాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం పదండి.
ముందు ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ ను పోయాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో పొట్టు తొలగించిన వెల్లుల్లి రెబ్బలు వేసి నీరు సగం అయ్యేంత వరకు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన వెల్లుల్లి రెబ్బలను వాటర్ తో సహా బ్లెండర్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, పావు టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని కళ్ళల్లోకి వెళ్ళకుండా ముఖానికి అప్లై చేసుకుని వేళ్ళతో సున్నితంగా కనీసం ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై అరగంట పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.
అరగంట అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే చర్మంపై ఒక్క మచ్చ కూడా ఉండదు.
స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది.పైగా చర్మం టైట్ గా మరియు బ్రైట్ గా మారుతుంది.
వృద్ధాప్య ఛాయలు సైతం త్వరగా దరిచేరకుండా ఉంటాయి.