స్త్రీ పురుషుడు అనే తేడా లేకుండా అందరిని సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో చుండ్రు ఒకటి.చుండ్రు( dandruff ) వల్ల తీవ్రమైన చికాకు కలుగుతుంది.
అలాగే తలలో దురద, జుట్టు పొడిగా మారడం, హెయిర్ ఫాల్( Hair fall ) వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.అలాగే తలలో చుండ్రు ఉంటే అది ముఖంపై పడి మొటిమలు కూడా వస్తుంటాయి.
ఈ క్రమంలోనే చుండ్రు సమస్యను నివారించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ మేడ్ హెయిర్ టోనర్ ను కనుక వాడితే చాలా వేగంగా మరియు సులభంగా చుండ్రును తరిమికొట్టొచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం చుండ్రును మాయం చేసే ఆ హెయిర్ టోనర్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో ఒక కప్పు గులాబీ రేకులను( Rose petals ) వేసుకోవాలి.అలాగే రెండు బిర్యానీ ఆకులు, నాలుగు లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క వేసుకుని పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత నాలుగు చుక్కలు నీమ్ ఎసెన్షియల్ ఆయిల్( Neem essential oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన హెయిర్ టోనర్ సిద్ధం అవుతుంది.ఈ హెయిర్ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ కు ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారంలో రెండు సార్లు ఇలా కనుక చేస్తే చుండ్రు దెబ్బకు పరార్ అవుతుంది.అలాగే ఈ హోమ్ మేడ్ హెయిర్ టోనర్ ను వాడటం వల్ల జుట్టు నుంచి మంచి సువాసన కూడా వస్తుంది.