కొడుకుని చూపించేసిన కాజల్.. అడోరబుల్ అంటూ నెటిజెన్స్ ప్రశంసలు!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ చందమామ కాజల్ అగర్వాల్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు స్టార్ హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

 Kajal Aggarwal Reveals Son Neil's Face For The First Time, Kajal Aggarwal , Gau-TeluguStop.com

ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దం పైగానే అవుతున్నా కూడా మొన్నటి వరకు అదే గ్లామర్ మెయిన్ టెన్ చేస్తూ అందరికి గట్టి పోటీ ఇచ్చింది.చిన్న హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు నటించిన ముద్దుగుమ్మ కాజల్ ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యింది.

ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లు ను 2020 అక్టోబర్ 30న పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ ను కూడా ఆస్వాదిస్తోంది.ఇక పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటూ స్పీడ్ పెంచింది.

అయితే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత మరేమీ సినిమాలు ఒప్పుకోవడం లేదు.ఈ సినిమాలో చేసిన ఈమె రోల్ ను తీసేసారు.

కాజల్ తల్లి కాబోతున్న నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

ఇటీవలే కాజల్ అగర్వాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

ప్రెసెంట్ ఈమె మాతృత్వం లోని మాధుర్యన్ని ఆస్వాదిస్తోంది.తల్లిగా మారిన తర్వాత ఇంట్లోనే ఈమె లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

అయితే ఇక ఈమె మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.కమల్ హాసన్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమా సెట్స్ లో ఈ బ్యూటీ జాయిన్ అయ్యింది.

ఒకవైపు బిడ్డతో సమయం గడుపుతూనే మరో వైపు సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటుంది.

ఇక ఇప్పటి వరకు ఈమె తన బిడ్డను చూపించకుండా దోబూచు లాడింది.అయితే తాజాగా ఈమె తన బిడ్డను కెమెరాకు చూపించి అందరిని ఆశ్చర్య పరిచింది.తాజాగా తన భర్త కుమారుడితో కలిసి విమానాశ్రయంలో కెమెరాకు చిక్కిన కాజల్ తన కొడుకును కూడా చూపించి షాక్ ఇచ్చింది.

తన కొడుకు ముఖాన్ని కెమెరాకు చూపించి థ్రిల్ చేసింది.ఈమె ముంబై విమానాశ్రయంలో కొడుకు నీల్ ముఖాన్ని చూపించింది.కాజల్ కొడుకుని చుసిన వారంతా అడోరబుల్ అని అనకుండా ఉండలేక పోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube