ఈ ఐపీఎస్ తీసుకున్న నిర్ణ‌యం తెలిస్తే షాక్ అవ్వాల్సిందేనేమో!

ప్రస్తుత రోజుల్లో ఐపీఎస్ ల నిర్ణయాలు అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి.

చాలా మంది ఐపీఎస్ అధికారులు స్వచ్ఛంద విరమణ తీసుకుంటూ తమ పదవులకు గుడ్ బై చెబుతున్నారు.

పదవికి గుడ్ బై చెప్పేందుకు కారణాలు ఎలా ఉన్న కానీ కొంత మందికి మాత్రం వారు చేసే పనులు రుచించడం లేదు.అలాంటి వారు బాహాటంగానే ఐపీఎస్ అధికారుల నిర్ణయాలను తప్పుబడుతున్నారు.

ఐపీఎస్ గా ఎంపిక కావడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుందని అలా ఎంతో కష్టపడి సాధించిన పదవిని ఇలా ఏవో కారణాలు చెప్పి వదిలేయడం సబబు కాదని అంటున్నారు.మొన్న తెలంగాణలో ఐపీఎస్, గురుకులాల ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని అందర్నీ షాక్ కు గురి చేశాడు.ఇప్పడుఉ హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారిణి భారతీ అరోనా తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కు గురి చేస్తుంది.

ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లో కి రావడం కోసం స్వచ్ఛంద పదవీ విరమణ చేయగా.భారతి అరోరా మాత్రం అందుకు భిన్నంగా శ్రీ కృష్ణుడి సేవకు తన జీవితాన్ని అంకితం చేయడం కోసమని స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రటించి అందరినీ విస్మయానికి గురి చేశారు.

Advertisement

భారతీ ప్రస్తుతం అంబాలా రేంజి డివిజన్ లో ఇన్ స్పెక్టర్ జనరల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.కాగా భారతీ అరోనా 1998 వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిని.

అంతే కాకుండా ఈమె తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా ఖచ్చితత్వంతో నిర్వర్తించి ఉత్తమ అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు.భారతి అరోరా రైల్వే సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నపుడు 2007 వ సంవత్సరంలో సంజౌతా ఎక్స్ ప్రెస్ రైలు పేలుడు కేసును దర్యాప్తు చేయడం గమనార్హం.

ఈ మేరకు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు భారతీ అరోనా హర్యానా చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు.కాగా.భారతి అరోనా రాజీనామా ఆగస్టు 1 నుంచి అమలులోకి రానుంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు