కొంత మందికి అదృష్టం వెన్నంటే ఉంటుంది.వారు పట్టిందల్లా బంగారం అవుతుంది.
తమ శ్రమకు తోడు లక్ మూలంగా ఎంతో మంది ఉన్నత స్థానాలకు చేరిన వారున్నారు.అలాంటి వారిలో తెలుగు సినిమా హీరోయిన్లు కూడా ఉన్నారు.
తొలి సారే మంచి ఇంప్రెషన్ తో జనాల మనుసులను దోచుకున్నారు.ఇడస్ట్రీలోకి అడుగు పెట్టి తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నారు.
అలా వచ్చి.ఇలా స్టార్ డమ్ సంపాదించారు.
తొలి సినిమాతో మొదలుకొని వరుస సినిమాలు చేస్తూ దుమ్మురేపుతున్నారు.ఇంతకీ తొలి సినిమాతోనే తమ సత్తా చాటుకున్న తెలుగు నటీమణులు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సమంత
తను తెలుగులో నటించిన తొలి సినిమా ఏం మాయ చేసావె.ఈ సినిమాతోనే బంఫర్ హిట్ కొట్టింది ఈ కేరళ బ్యూటీ.తొలి సినిమా విజయంవంతం కావడంతో ఆమె వెనుతిరిగి చూసుకోలేదు.అంతే కాదు తనతో ఫస్ట్ సినిమా చేసిన అబ్బాయి నాగచైతన్యతోనే లవ్ లో పడింది.ఇద్దరూ కలిసి ప్రేమ వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత కూడా అద్భుత సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది సమంతా.
సాయి పల్లవి

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఫిదా.ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించింది మలయాళీ భామ సాయి పల్లవి.తన తొలి సినిమాతోనే చక్కటి నటనతో జనాలను ఆకట్టుకుంది.ఈ సినిమాలో తన నేచురల్ యాక్టింగ్ తో తెలుగు అమ్మాయిలా మారిపోయింది.తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి వారెవ్వా అనిపించింది.మొత్తంగా తన తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టి.వరుస సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు.
రాశీ ఖన్నా

ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా.తన తొలి చిత్రంతోనే హిట్ కొట్టింది.జనాలకు మరింత చేరువైంది.ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తుంది.
రకుల్ ప్రీత్ సింగ్

వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు జనాల ముందుకు వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.తొలిసినిమాతోనే విజయం సాధించి వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.
శాలిని పాండే

అర్జున్ రెడ్డి
మూవీతో విజయ్ దేవరకొండ సరసన నటించి సంచలన విజయం అందుకుంది శాలిని పాండే.అయినా ఆ తర్వాత ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.
పాయల్ రాజ్ ఫుత్

ఆర్ ఎక్స్ 100 మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం కలిగించింది పాయల్ రాజ్ ఫుత్.యువకుల గుండెల్లో రొమాన్స్ బాంబ్ పేల్చింది.