టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో మంచు ఫ్యామిలీ(Manchu Family) ఒకటి.మోహన్ బాబు ( Mohan Babu )ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అనంతరం ఈయన వారసులుగా విష్ణు మనోజ్ లక్ష్మీ ప్రసన్న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారికంటూ గుర్తింపు పొందడం కోసం కృషి చేస్తున్నారు.
ఇకపోతే గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో విభేదాలు తలేతుతాయని వార్తలు వినపడుతూ ఉన్నాయి.తాజాగా వీరి మధ్య చోటు చేసుకున్నటువంటి గొడవకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఇంటి పరువు మొత్తం బజారు పడినట్టు అయింది.
ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మంచు లక్ష్మి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా అవుతుంది.

ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మంచు లక్ష్మి(Manchu Lakshmi)మాట్లాడుతూ తమ ఇంట్లో తన తండ్రి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని, ఏదైనా గొడవ జరిగిందంటే వెంటనే అందరిని పిలిచి మాట్లాడతారని ఈమె తెలిపారు.ఇక ఇలాంటి గొడవలు ప్రతి ఒక్క ఇంట్లోనే జరుగుతాయి మీరు మంచు మోహన్ బాబు పిల్లలు కదా మీ విషయంలో జరగదా అని ఏం లేదు ప్రతి ఒక్కరి విషయంలోనే ఇలాంటి గొడవలు జరగడం సర్వసాధారణం.అయితే మేం ఇలాంటి గొడవలను బయటికి వచ్చి చెప్పుకోలేము.
ఇక నిజాలు కనుక చెబితే ఇలా కూడా ఉంటారా అని మీరు తట్టుకోలేరు.

మా ఇంటి పేరు పరువు ప్రతిష్టలను కాపాడుకోవడం కోసం ప్రతి చిన్న గొడవకు బయటకు రాలేము.ప్రతి మోసాన్ని ఒప్పుకోలేము అంటూ ఈమె షాకింగ్ కామెంట్ చేశారు.ఇక మా నాన్న ఎన్నో అవమానాలను పడ్డారు కనుక మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని తరచూ హెచ్చరిస్తూ ఉంటారు.
ఈరోజు మేం తప్పు చేశామని ఎవరైనా నాన్నకు ఫోన్ చేసి కనుక చెబితే వెంటనే పిలిపించి ఆయన మాట్లాడతారని తెలిపారు.అయితే గతంలో మంచు లక్ష్మి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం విష్ణు మనోజ్ మధ్య గొడవకు సరిగ్గా సరిపోవడంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి అయితే మనోజ్ విష్ణు విషయంలో జరిగిన గొడవపై మోహన్ బాబు ఇది వరికే స్పందిస్తూ వారికి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది.
ఇక తన తండ్రి చెప్పడంతోనే మనోజ్ ఆ వీడియోని కూడా డిలీట్ చేశారు.అయితే ఇది పెద్దగా ఆలోచించాల్సిన విషయం కాదని అన్నదమ్ముల మధ్య సర్వసాధారణంగా ఉండే గొడవలేనట్టు మోహన్ బాబు తెలిపారు.







