ప్రస్తుతం ప్రభాస్ ( Prabhas ) చేస్తున్న చాలా చిత్రాల్లో మారుతి ( Director Maruthi ) సినిమా ఒకటి అనే విషయం అందరికి తెల్సిందే.కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు.
ఈ మధ్య కాలంలో మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సినిమా చిత్రీకరణ ప్రారంభం అయింది.అంతే కాకుండా రెండు షెడ్యూల్ కూడా పూర్తి చేశారు.
అయినా ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ను ఏ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది అనే విషయం పై కూడా అధికారికంగా క్లారిటీ లేదు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ కాంబినేషన్ సినిమా ను నిర్మిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది.

ఆ విషయమై పీపుల్స్ మీడియా వారు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ అతి త్వరలోనే అన్ని విషయాలను తెలియజేస్తాం అంటూ అధికారికంగా ప్రకటించారు.ప్రభాస్ సినిమా ను తాము నిర్మిస్తున్నది లేనిది క్లారిటీ ఇవ్వకుండా అతి త్వరలోనే అంటూ ప్రకటించడంతో అభిమానులు మరింత ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన ఉగాది సందర్భంగా వస్తుందని ఎదురు చూసిన అభిమానులకు నిరాశ మిగిలింది.
కొందరు అభిమానులు మారుతి దర్శకత్వం లో ప్రభాస్ సినిమా ను వ్యతిరేకిస్తున్నారు.అందుకే సినిమా ఫస్ట్ లుక్ విడుదలతోనే అనౌన్స్ చేయాలనే ఉద్దేశం తో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ( People Media Factory ) వారు దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మిస్తున్నారట.అందులో 100 కోట్ల రూపాయలు ప్రభాస్ రెమ్యూనరేషన్ గా తెలుస్తోంది.మొత్తానికి మారుతి దర్శకత్వం లో ప్రభాస్ హీరో గా సినిమా కి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వర్గాల నుండి సమాచారం అందడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మరో వైపు ప్రభాస్ సలార్ మరియు ఆదిపురుష్ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.







