పల్నాడు జిల్లా మాచర్ల: మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా సినిమా దర్శకులు నక్కిన త్రినాదరావు మాచర్ల పట్టణంలోని ధమాకా సినిమా ఆడుతున్న థియేటర్ కు వచ్చి సందడి చేశారు.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ధమాకా సినిమా విజయవంతం అయితే దుర్గి మండలంలోని నీలంపాటి అమ్మవారి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నట్లు మొక్కు తీర్చుకొనేందుకు వచ్చామని అన్నారు.
అనంతరం థియేటర్లో నీ ప్రేక్షకులతో మాట్లాడుతూ ఈ సినిమాని ఇంత విజయం వంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ దాసరి కిరణ్ మరో దర్శకులు పులుసు సత్యారెడ్డి పాల్గొన్నారు.