టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న స్టార్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.ఈయన ఒక సినిమాను నిర్మిస్తున్నాడు అంటే ఆ సినిమా పక్కా హిట్ అనే ముద్ర వేసుకుంది.
అంతలా ఈయన ప్రొడ్యూసర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.అయితే ఇంతకు ముందు ఈయన అన్ని కూడా చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలే చేసే వాడు.
కానీ ఇప్పుడు అలా కాదు.
ఇప్పుడు రోజులు మారుతుండడంతో తన బ్యానర్ మార్కెట్ కూడా విస్తరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈయన వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.అది కూడా భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం.
ప్రెజెంట్ దిల్ రాజు చేస్తున్న సినిమాల్లో కోలీవుడ్ ‘వారిసు’ ఒకటి.ఈ సినిమాలో విజయ్ దళపతి హీరోగా నటిస్తున్నాడు.

పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.తమిళ్ లో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు.అయితే ఈయన తాజాగా కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసాడు అని నిన్నటి నుండి వార్తల్లో మారుమోగి పోతుంది.
మరి తాజాగా ఈ వార్తలపై దిల్ రాజు స్పందించారు.

దిల్ రాజు స్పందిస్తూ.”తాను మాట్లాడిన అన్ని మాటలు చెప్పకుండా కేవలం ఒక్క పాయింట్ ను మాత్రమే కట్ చేసి కొంత మంది ప్రచారం చేస్తున్నారు.మొత్తం 40 నిముషాల వీడియోలో ఈయన మాట్లాడినా ఒక్క మాటను హైలెట్ చేస్తూ కాంట్రవర్సీ చేయడం బాగోలేదని.
నేను ఎవ్వరిని ఎక్కడ తగ్గించలేదు.ఎవరిని పొగడలేదు.
ఇంటర్వ్యూ మొత్తం చుస్తే మీకే అర్ధం అవుతుంది” అని ఆవేదన వ్యక్తం చేసారు.








