సోహెల్ కు అభిమాని సర్ప్రైజ్ గిఫ్ట్.. ఏం ఇచ్చారంటే..?

బిగ్ బాస్ సీజన్ 4లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఏ మాత్రం ప్రేక్షకులకు పరిచయం లేని కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న సోహెల్ ఎవరూ ఊహించని విధంగా టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలవడంతో పాటు తెలివిగా బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలేలో 25 లక్షల రూపాయల ఫ్రైజ్ మనీని గెలుచుకున్నారు.బిగ్ బాస్ షోకు ముందు సోహెల్ సీరియళ్లలో నటించినా ఆ సీరియళ్లు అతనికి పెద్దగా గుర్తింపును తెచ్చిపెట్టలేదు.

 Bigg Boss Fame Syed Sohel Ryan Gets Suprprise  Birthday Bike Gift From Fan, Big-TeluguStop.com

సింగరేణి ముద్దుబిడ్డగా పేరు తెచ్చుకున్న సోహెల్ కు బిగ్ బాస్ షో తరువాత హీరోగా ఆఫర్లు వస్తున్నాయి.ప్రస్తుతం సోహెల్ ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నారు.మరోవైపు సోహెల్ ను అభిమానించే అభిమానుల సంఖ్య, సోహెల్ సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది.ఈ నెల 18వ తేదీన సోహెల్ పుట్టినరోజు కాగా సోహెల్ ఫ్యాన్ ఒకరు అతనికి స్పోర్ట్స్ బైక్ ను గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది.

సోహెల్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వీడియో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఖరీదైన బైక్ గిఫ్ట్ గా రావడంతో సోహెల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరోవైపు సోహెల్ బుల్లితెర షోలలో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ సందడి చేస్తున్నారు.స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోలో సోహెల్ అప్పుడప్పుడూ అవినాష్ స్కిట్లలో కనిపిస్తున్నారు.

హీరోగా సోహెల్ సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.సోహెల్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో నటిస్తానని మాట ఇవ్వగా సోహెల్ ఫస్ట్ మూవీలోనే మెగాస్టార్ నటిస్తారో లేక మరో సినిమాలో నటిస్తారో లేదో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ షో తరువాత సోహెల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube