తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సంయుక్త( Samyuktha Menon ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సంయుక్త.
ప్రస్తుతం తెలుగుతోపాటు మలయాళ భాషల్లో వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంయుక్త ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ సందర్భంగా సంయుక్త మాట్లాడుతూ.మలయాళంతో పోలిస్తే తెలుగు సినిమాల్లో( Telugu Movies ) నటించాలంటే చాలా కష్టం.భాష రాకపోవడం ఒక కారణం అయితే, మేకప్ మరో కారణం.వినడానికి వింతగా ఉన్నా కూడా నా వరకు అది చాలా పెద్ద విషయం.మలయాళ సినిమాల్లో చేసేటప్పుడు మేకప్ వేసుకోవడం వెంటనే అయిపోతుంది.చాలా లైట్‌గా, సహజంగా వేస్తారు.
యాక్టింగ్ చేసేటప్పుడు కూడా పూర్తి స్వేచ్ఛ ఉన్నట్లు అనిపిస్తుంది.కానీ, టాలీవుడ్‌లో స్వీయ జాగ్రత్తలు చాలా తీసుకోవాలి.
తెరపై ఎలా కనిపిస్తామా అని ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలీ.ఎక్కువ మేకప్ వేస్తారు.
షాట్ చేస్తున్నప్పుడు కూడా మేకప్‌ను ( Makeup ) చెక్ చేసుకోవాలి.
ఇది సౌకర్యానికి పూర్తి విరుద్ధం.చర్మం, ముఖంపై ఏదో ఉన్నట్లు అనిపిస్తుంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సంయుక్త.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా సంయుక్తా ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభూ సినిమాలో( Swayambhu Movie ) నటిస్తోంది.భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సోషియో ఫాంటసీ చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.
దీనితో పాటు శర్వానంద్‌తోనూ ఓ చిత్రంలో నటిస్తున్నారు.