‘వ్యూ వన్స్‌’ వాట్సాప్‌ నయా ఫీచర్‌!

దిగ్గజ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో ఫీచర్‌ను పరిచయం చేయనుంది.వాట్సాప్‌ అనవసరమైన స్టోరేజీకి సంబంధించిన ఫీచర్లను వాట్సాప్‌ ఇటీవల తొలగిస్తానన్న విషయం తెలిసిందే! దీంతో పాటు యూజర్ల అభిరుచికి తగ్గట్టుగా వాట్సాప్‌ కొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.

 Whatsapp Introduced New Feature Of View Once Android Ios , New Features,  Whatsa-TeluguStop.com

తాజాగా ‘వ్యూ వన్స్‌’ అనే కొత్త ఫీచర్‌ను రూపొందిస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది.ఆ వివరాలు తెలుసుకుందాం! ముఖ్యంగా ఈ ఫీచర్‌తో వినియోగదారుడు కేవలం ఒక్కసారి మాత్రమే రిసీవర్‌ చూడగలుగుతాడు.

ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో ఇప్పటికే ప్రవేశపెట్టింది.

వ్యూ వన్స్‌ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకున్నప్పుడు ఒక వినియోగదారుడు పంపిన పుడు యూజర్‌ పంపిన వీడియో, ఫోటో, ఇతర మీడియాను రిసీవర్‌ ఒక్కసారి మాత్రమే చూడగలుగుతాడు.

ఒకవేళ నయా ఫీచర్‌ మీ మొబైల్‌ ఫోన్‌లో కనిపించకుంటే ఓసారి వాట్సాప్‌ యాప్‌ను అప్డేట్‌ చేస్తే సరిపోతుంది.ప్రస్తుతం ఈ వాట్సాప్‌ నయా ఫీచర్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.దీని పనితీరుపై కూడా వాట్సాప్‌ యాజమాన్యం ఓ నివేదికలో వెల్లడించింది.

యాక్టివేట్‌ చేసుకునే విధానం.

Telugu Android Ios, Whatsapp, Whatss App-Latest News - Telugu

యాప్‌ అప్డేట్‌ చేసిన తర్వాత, మెస్సేజ్‌ తగ్గర ప్రీ వ్యూ ఆప్షన్‌ కనిపిస్తుంది.యూజర్‌ పంపే ఫైల్స్, ఫోటోస్‌ ఒకవేళ ఈ మోడ్‌ ద్వారా పంపితే రీసీవర్‌ ఒకసారి ఓపెన్‌ చేసి, తిరిగి వెనక్కి వెళ్లినప్పుడు అవి ఆటోమెటిగ్గా డిలీట్‌ అవుతుంది.దీంతోపాటు రిసీవర్‌కు మెస్సేజ్‌ డెలివరీ అయిందా లేదా? దాన్ని ఓపెన్‌ చేశారా? లేదా? అనే సమాచారాన్ని యూజర్లు చెక్‌ చేసుకోవచ్చు.ఇది పర్సనల్‌ మెసేజ్‌లలోనే కాదుఈ సరికొత్త వ్యూ వ¯Œ ్స ఫీచర్‌ వాట్సాప్‌ గ్రూప్స్‌లో కూడా పని చేస్తుంది.

ఈ మోడ్‌లో పంపిన మీడియాను గ్రూప్‌లో ఉన్న సభ్యులందరూ ఒక్కసారి మాత్రమే చూసే వీలుంటుంది.గ్రూప్‌లోని మెస్సేజ్‌ ఇ¯Œ ఫో ఆప్ష¯Œ పై క్లిక్‌ చేస్తే మీడియాను ఎంతమంది ఓపెన్‌ చేశారో తెలుస్తుంది.

అయితే యూజర్లు బ్లాక్‌ చేసిన కాంటాక్ట్స్‌ గ్రూప్స్‌లో అందరితో పాటే యాక్టివ్‌గా ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube