ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అంటూ ఒక కవి అన్నాడు.ఆ మాట నూటికి రెండు వందల శాతం నిజమే అంటూ పలు సార్లు నిరూపితం అయ్యింది.
మహిళల అభిరుచి విషయంలో కూడా అలాంటిది ఏదైనా పదం ఏ కవి అయినా రాయాలి.ఎందుకంటే వారి అభిరుచికి అర్థం చాలా విరుద్దంగా ఉంటుంది.
అంటే అందమైన వాటిని కాకుండా వాటిలో ఉండే గుణాలను బట్టి ఆడవారు ఎక్కువ శాతం ఇష్టపడటం జరుగుతుంది.ఆ విషయంలో మగాడు అయినా కూడా ఆడవారు అదే విధంగా ఆలోచిస్తారు అంటూ వెళ్లడయ్యింది.
తాజాగా అమెరికాకు చెందిన ఒక ప్రముఖ ఆన్ లైన్ మ్యాగజైన్ సంస్థ ఆడవారి విషయాల్లో కొన్ని సర్వేలను నిర్వహించింది.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వంద దేశాలకు చెందిన ఆడవారు ఈ సర్వేలో పాల్గొన్నారు.ఆ సర్వేలో ఆడవారు చెప్పిన విషయాలతో సర్వే నిర్వాహకులు కూడా విస్తు పోయారు.17 నుండి 40 ఏళ్ల లోపు ఆడవారిని పలు విషయాల గురించి ప్రశ్నించిన సమయంలో వారి సమాధానాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయంటూ సర్వేను చేసిన వారు చెప్పుకొచ్చారు.మగవారిలో ఏ విషయాలను చూసి మీరు ఎక్కువగా ఇష్టపడతారు అంటూ వారిని ప్రశ్నించిన సమయంలో వారి అందం అనే సమాధానం చాలా తక్కువగా వచ్చిందట.వారి అందంను చూసి ఇష్టపడే వారి సంఖ్య చాలా అంటే చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు.
![](https://telugustop.com/wp-content/uploads/2019/03/Women-really-are-more-attracted-to-men-who-make-themlaughstudy.jpg)
ఎక్కువ శాతం ఆడవారు మగవారిలోని సెన్సాఫ్ హ్యూమర్ మరియు మాట్లాడే చతురతను బట్టి ఇష్టపడుతున్నారట.ఉదాహరణకు ఒక వ్యక్తి ఎంత తెలివి ఉన్నా, అందంగా ఉన్నా, ఎంత జీతం సంపాదిస్తున్నా కూడా వారు అమ్మాయిలు మాత్రం మంచి మాటకారి తనం ఉండి, ఎంటర్ టైన్ చేసే మగాళ్లను మాత్రమే ఇష్టపడతారట.అమ్మాయిలు నాలుగు మంచి మాటలు నవ్వుతూ చెప్పి, నవ్విస్తే తప్పకుండా వారిపై వెంటనే ఒక అభిప్రాయంకు వస్తారట.అలా జోవియల్‌గా ఉండే వారు శృంగారంలో బాగా సంతృప్తి పర్చుతారని ఆడవారు భావిస్తున్నారట.
ముభావంగా ఉండే వారు, ఎప్పుడు కూడా సీరియస్‌గా ఫేస్ పెట్టి దీర్ఘంగా ఆలోచించే వారు శృంగారంలో కూడా సంతృప్తి పర్చలేరు అనేది తమ అభిప్రాయం అంటూ ఎక్కువ శాతం ఆడవారు చెబుతున్నారు.
![](https://telugustop.com/wp-content/uploads/2019/03/Womenreally-are-more-attracted-to-men-who-make-them-laugh-study.jpg)
అందుకే నవ్వుతూ, మాయమాటలు చెప్పి, మోసగించే వారినే ఎక్కువగా అమ్మాయిలు నమ్ముతూ ఉంటారు.ఈ సర్వే ఫలితం చూస్తుంటే అమ్మాయిలు ఎందుకు ఎక్కువగా ఎదవలను ప్రేమిస్తారో అర్థం అవుతుంది కదా.! అమ్మాయిల దృష్టిలో పడాలంటే కేవలం అందంగా ఉంటే సరిపోదని, మొహంపై ఎప్పుడు నవ్వు పులుముకుని, యాక్టివ్‌గా ఉంటూ, వారిని చిల్లర జోకులు వేస్తూ నవ్వించాలి.అమ్మాయిలు అయినా, ఆడవారు అయినా కూడా భాగస్వామి జోవియల్‌గా ఉంటేనే ఇష్టపడతారు.అందుకే అబ్బాయిలు చూసుకోండి మరి.