Ayodhya Bala Rama : అయోధ్య బాల రాముడిని దర్శించుకునే భక్తులకు కొత్త నియమాలివే.. ఆలయంలో ఈ పొరపాట్లు చేయొద్దంటూ?

అయోధ్య బాలరాముడిని( Balarama of Ayodhya ) దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.అయోధ్యకు రైళ్లు పరిమితంగానే ఉన్నా వేర్వేరు రవాణా మార్గాల భక్తులు బాలరాముడిని దర్శించుకుంటున్నారు.

 Shocking Tips To Ayodhya Rama Mandir Devotees Details Here Goes Viral-TeluguStop.com

అయితే భక్తులకు ప్రయోజనం చేకూరేలా ఆలయ ట్రస్ట్ కొన్ని నియమ నిబంధనలను రిలీజ్ చేయగా ఆ రూల్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.ప్రతిరోజూ లక్షన్నరకు అటూఇటుగా భక్తులు బాలరాముడిని దర్శించుకుంటున్నారు.

కొంతమంది మోసగాళ్లు యాత్రికులను( Pilgrims ) మొసం చేస్తున్న నేపథ్యంలో ట్రస్ట్ కీలక విషయాలను వెల్లడించింది.ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు బాలరాముడిని భక్తులు దర్శించుకునే అవకాశం అయితే ఉంటుంది.ఆలయానికి వచ్చిన భక్తులు గంట నుంచి గంటన్నర లోగా బాలరాముడిని దర్శించుకోవచ్చని ట్రస్ట్ సూచించింది.

Telugu Ayodhyabala, Tipsayodhya-General-Telugu

చెప్పులు, మొబైల్ ఫోన్లు, పర్స్ ( Sandals, mobile phones, purses )లను ఆలయం లోపలికి అనుమతించబోమని వాటిని బయటే వదిలి రావాలని తెలుస్తోంది.పూలు, దండలు, ప్రసాదాలను ఆలయంలోకి అనుమతించబోమని ట్రస్ట్ చెబుతుండటం గమనార్హం.ప్రత్యేక దర్శనాలు అని చెప్పి డబ్బులు డిమాండ్ చేసేవాళ్లను నమ్మవద్దని ట్రస్ట్ కోరడం గమనార్హం.

వేర్వేరు సమయాల్లో ఇచ్చే మంగళ హారతి, అలంకరణ హారతి, శయన హారతికి మాత్రమే అనుపతి పత్రాలు అవసరమని ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు.

Telugu Ayodhyabala, Tipsayodhya-General-Telugu

దివ్యాంగుల కొరకు వీల్ చైర్లు ఉన్నాయని వీల్ చైర్ కు ఎలాంటి రుసుము వసూలు చేయబోమని వీల్ చైర్ నడిపే వాలంటీర్ కు మాత్రం నామ మాత్రపు రుసుము ఇవ్వాల్సి ఉంటుందని ట్రస్ట్ సభ్యులు( Members of the Trust ) అన్నారు.అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకునే భక్తులు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.అయోధ్యలో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలని భావించి ట్రస్ట్ సభ్యులు ఈ కీలక సూచనలు చేయడం జరిగింది.

ఆలయానికి వెళ్లే భక్తులు ఎలాంటి పొరపాట్లు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube