ఒకప్పుడు హోటల్ సర్వర్ గా( Hotel Server ) పని చేసిన వ్యక్తి కెరీర్ పరంగా సక్సెస్ సాధించి వేల కోట్ల రూపాయలకు అధిపతి కావడం సులువైన విషయం కాదు.అయితే అలా సక్సెస్ సాధించడం ద్వారా జెన్సన్ హువాంగ్( Jensen Huang ) ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.నిరంతర ప్రయత్నం, అంకిత భావం ఉంటే లక్ష్యాన్ని సాధించడం సులువు కాదనే సంగతి తెలిసిందే.1963 సంవత్సరంలో తైవాన్ లోని( Taiwan ) తైనాన్ లో జెన్సర్ హువాంగ్ జన్మించారు.
ఐదు సంవత్సరాల వయస్సులోనే ఇతని ఫ్యామిలీ థాయిలాండ్ కు మకాం మార్చింది.9 సంవత్సరాల వయస్సులో మేనమామతో కలిసి వాషింగ్టన్ లోని టకోమాకు వెళ్లిన జెన్సన్ హువాంగ్ చాలా సంవత్సరాల క్రితం డెన్నీ రెస్టారెంట్ లో సర్వర్ గా పని చేశారు.1993 సంవత్సరంలో కొంతమందితో కలిసి ఎన్ విడియాను( Nvidia ) స్థాపించిన జెన్సన్ హువాంగ్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదగడం గమనార్హం.

2007 సంవత్సరంలో జెన్సన్ హువాంగ్ సీఈవోగా 24.6 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్నారు.యునైటెడ్ స్టేట్స్ లో( United States ) ఎక్కువ మొత్తం వేతనం తీసుకునే 61వ వ్యక్తిగా ఆయన నిలిచారు.
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో జెన్సన్ హువాంగ్ 23వ స్థానంలో ఉన్నారు.ఈయన కంపెనీ క్యాపిటైజైషన్ 1.83 ట్రిలియన్లు కావడం గమనార్హం.

కృషి, పట్టుదల ఉంటే ఆలస్యంగా అయినా సక్సెస్ దక్కుతుందని జెన్సన్ హువాంగ్ ప్రూవ్ చేస్తున్నారు.తన ప్రతిభతో ఈ స్థాయికి ఎదిగిన జెన్సన్ హువాంగ్ సక్సెస్ స్టోరీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని నెటిజన్లు చెబుతున్నారు.తన ప్రతిభతో జెన్సన్ హువాంగ్ ప్రశంసలు అందుకుంటున్నారు.
జెన్సన్ హువాంగ్ ను స్పూర్తిగా తలచుకుని కెరీర్ పరంగా ఎదిగితే ఆలస్యంగా అయినా సక్సెస్ సొంతమవుతుందని చెప్పవచ్చు.ఎన్నో కష్టాలను అనుభవించిన జెన్సన్ తన ప్రతిభతో ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకోవడం గమనార్హం.







