మన భారతదేశంలో మతపరమైన ఆచారాలు ఈ ఆకుకు ముఖ్యమైన స్థానం ఉంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.పండుగలు, ప్రత్యేక సందర్భాలలో దేవతామూర్తులకు తమలపాకుల( betel leaves )తో అభిషేకం చేస్తారు.
అయితే మన పూర్వీకులు తములపాకు యొక్క విశిష్ట ఔషధ గుణాలు( Medicinal properties ) తెలిసి మితంగా ఉపయోగించేవారు.కానీ రాను రాను ఈ తమలపాకులను ఎవరికి నచ్చినట్లు వారు ఉపయోగిస్తున్నారు.
కాబట్టే తమలపాకులో ఉండే ఔషధ గుణాలను సరిగ్గా ఉపయోగించలేకపోతున్నారు.మరి తమలపాకు యొక్క ఔషధ గుణాలు ఎలా ఉంటాయి? అలాగే ప్రతిరోజు ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయాలపై ప్రస్తుత రోజుల్లోనీ ప్రజలు దృష్టి పెట్టడం లేదు.

కానీ కొన్ని సమస్యలకు మనం ఇంట్లోనే పరిష్కారం చూపే అవకాశం ఉన్న చాలా మంది వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.అలాంటి ఔషధాలు తమలపాకులలో ఎన్నో ఉన్నాయి.వీటిలో క్యాల్షియం, విటమిన్ సి, పి ఎక్కువగా ఉంటాయి.ఆకలి నుంచి అరుగుదల వరకు అనారోగ్య సమస్యల( Health problems )కు ఈ తమలపాకులు సంజీవనిల ఉపయోగపడతాయి.
మొట్టమొదటిగా చెప్పుకోవాల్సి వస్తే భోజనం అయిన వెంటనే ఈ తమలపాకును నమలడం ఎక్కువగా చాలామందికి అలవాటు ఉండేది.ఇంకా చెప్పాలంటే నొప్పిని తగ్గించడంలో ఈ తమలపాకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
ఈ ఆకుల పేస్టుని గాయల మీద రాసుకోవచ్చు.తమలపాకు రసం తీసుకోవడం వల్ల శరీరంలోని నొప్పులు( Body Aches ) కూడా తగ్గిపోతాయి.

అలాగే వాపును కూడా తగ్గిస్తుంది.తమలపాకులను దంచి చూర్ణం చేసి రాత్రి అంతా నీటిలో ఉంచి ఉదయం పరిగడుపున ఈ నీటిని తాగడం వల్ల కడుపు కూడా శుభ్రం అవుతుందని ఆయుర్వేదం చెబుతోంది.తమలపాకును చెవులను మీద ఉంచి కట్టు కడితే తల లోని వేడి తగ్గిపోతుంది.అలాగే తలలో తలలో ఉండే వాస దోషం పోయి మైగ్రేన్ తల నొప్పి కూడా తగ్గిపోతుంది.
అధిక డిప్రెషన్ తో బాధపడే వాళ్ళు పాలలో తమలపాకు రసం కలిపి తాగితే మంచి ఉపశమనంతో పాటు నిద్ర కూడా బాగా పడుతుంది.అలాగే తమలపాకు రసం తాగితే గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
అలాగే గుండె చక్కగా పనిచేస్తుంది.లేత తమలపాకు రోజుకి ఒకటి చొప్పున తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండడమే కాకుండా రోగ నిరోధక శక్తి ( Immunity )పెరుగుతుంది.5 రూపాయలకు 50 తమలపాకులు తెచ్చుకుంటే మీరు ఎన్నో రకాల రోగాలను దూరం చేసుకోవచ్చు.