తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అదా శర్మ ( Ada Sharma )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె ఇటీవలే ది కేరళ స్టోరీ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో భారీగా గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమాతో దేశవ్యాప్తంగా భారీగా క్రేజ్ ని ఏర్పరచుకుంది అదా శర్మ.
కేరళలో జరిగిన బాలికల మిస్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్( box office ) వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఈ సినిమా ఆదా శర్మకు మరింత గుర్తింపును తీసుకొచ్చింది.
అంతకుముందు ఈమె పలు సినిమాలలో నటించిన రాణి గుర్తింపు ఈ ఒక్క సినిమాతో దక్కింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

కాగా ఈమె ఇటీవల కమాండో వెబ్ సిరీస్ ( Commando web series )ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే తాజాగా సోషల్ మీడియాలో అదా శర్మకు సంబంధించిన ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజపుత్( Sushant Singh Rajput ) గురించి కూడా మనందరికీ తెలిసిందే.ఈయన ఎంఎస్ ధోని సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.
ఆయన ముంబైలోని ఒక అపార్ట్మెంట్ లో సూసైడ్ చేసుకొని మరణించిన విషయం తెలిసిందే.కాగా తాజాగా ఆ ఇంటిని ఆదా శర్మ కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే గతంలో సుశాంత్ ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది.అంతే కాకుండా ఆ ఇంటికి సుశాంత్ నెలకు రూ.4.5 లక్షలు అద్దె చెల్లించేవారట.అయితే ఈ విషయంపై ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్దఎత్తున వైరల్ అవుతోంది.
అయితే త్వరలోనే ఆ ఇంటికి మారబోతున్నట్లు కూడా తెలుస్తోంది.మరి ఈ విషయంపై అదాశర్మ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.కాగా ఆదాశర్మ చేతిలో ప్రస్తుతం రెండు మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఇంకా కొన్ని చర్చల దశలో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.







