వివాదాస్పద నటి కంగనా రనౌత్ తాజాగా తన సరికొత్త సినిమా ఎమర్జెన్సీ నుంచి తన ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే.ఇక ఎమర్జెన్సీ సినిమాకి కంగనా నిర్మాతగా కూడా మారింది.
ఇక ప్రస్తుతం షూటింగ్ పనులతో బిజీగా ఉన్న కంగనా ఈ చిత్రంలో ఇందిరాగాంధీ పాత్రను పోషిస్తుంది.ఇందిరా అచ్చుగుద్దినట్టుగా కంగనా ఈ చిత్రంలో కనిపించడం విశేషం అయితే ఇప్పటి వరకే చాలామంది ఇందిరాగాంధీ పాత్రను పోషించారు అలా ఇందిరా పాత్రను పోషించి ఆ పాత్రను రక్తి కట్టించిన ఆ నటీమణులు ఎవరో ఒకసారి చూద్దాం.
నటి కిషోరి షహనే
బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో పీఎం నరేంద్ర మోదీ బయోపిక్ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో టీవీ నటి కిషోరి షహనే అద్భుతంగా నటించింది.
అవంతిక అకార్కర్
అతి కొద్ది సినిమాల్లో నటించిన అవంతిక నవాజుద్దీన్ సిద్ధిఖీ తీసిన బాల్ థాక్రే బయోపిక్ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రను ఎంతో చక్కగా పోషించిందనే చెప్పాలి.

లారా దత్తా
బాలీవుడ్ నటి లారాదత్త కూడా ఇందిరా గాంధీ పాత్రను పోషించింది ఈ పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయి నటించడం విశేషం ఎంతలా ఒదిగిపోయింది అంటే అసలు ఆమెను ఇందిరా గాంధీ కాదంటే నమ్మలేని విధంగా లారా దత్తా లుక్ ఉంది.అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ అనే సినిమాలో లారా దత్తా ఇందిరాగాంధీ పాత్రలో నటించింది.

సుచిత్ర సీన్
మూడు దశాబ్దాల క్రితం సంజయ్ కుమార్ తీసిన ఆంధీ అనే సినిమాలో సుచిత్ర సీన్ ఇందిరా గాంధీ పాత్రలో నటించి పవర్ఫుల్ లీడర్ గా కనువిందు చేసింది.

సుప్రియ వినోద్
తెలుగు జాతి గర్వపడే నటుడు ఎన్టీఆర్.ఆయన బయోపిక్ లో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్ర పోషించగా ఇది రెండు భాగాలుగా విడుదలైంది.ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో మరాఠీ నటి సుప్రియ వినోద్ చక్కగా నటించింది.