తెలుగు సినీ ప్రేక్షకులకు నటి జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె ఆ తరం ప్రేక్షకులకు ఈతరం ప్రేక్షకులకు ఇద్దరికి కూడా సుపరిచితమమే.
ఎన్నో సినిమాలలో నటించి సహజనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది జయసుధ.తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది.ఇప్పటికే ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఈమె ఇప్పటికీ సినిమాలలో నటిస్తూనే ఉంది.
అయితే జయసుధకు హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరింత గుర్తింపు వచ్చింది అని చెప్పవచ్చు.
కాగా ప్రస్తుతం జయసుధ వయసు 6పదుల వయసు దాటి ఏడు పదుల వయసుకు చేరువుగా ఉంది.
అయినప్పటికీ ఈమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.ఇది ఇలా ఉంటే కొంతకాలం కిందట జయసుధ భర్త మరణించిన విషయం తెలిసిందే.
భర్తను కోల్పోవడంతో ఒంటరిగా కొడుకుతో కలిసి జీవిస్తోంది.అయితే ఇప్పుడిప్పుడే ఆమె సినిమాలలో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్న ఇటువంటి సమయంలో జయసుధ ఏడు పదుల వయసులో పెళ్లికి సిద్ధపడుతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ఇంకొంతమంది అయితే జయసుధకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అంటూ కూడా వార్తలను సృష్టిస్తున్నారు.

చాలామంది ఈ వార్తలపై స్పందిస్తూ ఇదేం ప్రచారం 67 ఏళ్ల వయసులో జయసుధ మళ్లీ రెండో పెళ్లి సిద్ధమవ్వడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.కాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలపై జయసుధ స్పందించింది.ఎవరో కావాలనే కొంతమంది తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని ఆమె మండిపడింది.
సినిమాలలో బిజీ అవడం వల్ల ఒంటరితనం అనే బాధ నుంచి ఉపశమనం పొందుతున్నట్లు ఆమె తెలిపింది.అలాగే తన గురించి ఎందుకు ఇలా బ్యాడ్గా దుష్ప్రచారాలు చేస్తున్నారు అర్థం కావడం లేదు అని అసహనం వ్యక్తం చేసింది జయసుధ.
సోషల్ మీడియాలో ఇలా తన పెళ్లి విషయంలో వస్తున్న తప్పుడు ప్రచారాలు అన్ని ఆమెను మానసికంగా మరింత కృంగదీస్తున్నట్టు చెప్పుకొచ్చింది.







