నవంబర్ 17వ తేదీ నాగుల చవితి.. మీకు దగ్గరలో పుట్టలు లేవా? అయితే ఇలా చేయండి..!

ముఖ్యంగా చెప్పాలంటే దీపావళి పండుగ తర్వాత నాలుగో రోజు అంటే కార్తీకమాసం( Kartika masam ) శుక్లపక్ష చవితి రోజున నాగుల చవితి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది.దీపావళి రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి చిన్న పిల్లల చేత గోగు కాడలను నూనె వత్తులు కట్టి వెలిగించి మూడుసార్లు నేలపై కొట్టిస్తారు.

 November 17th Nagula Chavithi .. Don't You Have Any Mounds Near You? But Do Thi-TeluguStop.com

అప్పుడే వారి చేత ఇలా చెప్పిస్తారు.దుబ్బు దుబ్బు దీపావళి మళ్లీ వచ్చెను నాగుల చవితి అని అంటే దానికి అంతటి ప్రాశస్థ్యం ఉంది అనే పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే నవంబర్ నెల 17వ తేదీన శుక్రవారం రోజు నాగుల చవితి ( Nagula Chavithi )పండుగను జరుపుకుంటారు.

ఈ రోజు ఉదయం ఆవు పాలు( Cow milk ), చక్కర లేదా బెల్లం, పూలు, పండ్లు వంటి సామాగ్రి తీసుకొని నియమ నిష్ఠలతో పిల్లలతో సహా సమీపంలోనీ పుట్టల వద్దకు వెళ్లి అందులో పాలు పోసి మిగతావి నివేదనగా ఉంచుతారు.పిల్లలు బాణసంచ కలుస్తూ ఆనందిస్తారు.ఆ తర్వాత పుట్టమన్ను తీసుకుని పిల్లల చెవుల కింద భాగంలో రాస్తారు.

ఆ తర్వాత పిల్లలకు ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడమని, అలాగే ఎక్కడైనా కనిపించినా లేక పొరపాటున తొక్కిన కనికరం చూపమని నాగదేవతను మహిళలు వేడుకుంటారు.పుట్ట వద్దకు వెళ్లలేని వారు తమ ఇంట్లోనే పూజ మందిరంలో గోడకు పసుపు రాసి కుంకుమతో మూడు నిలువు గీతలు గీసి పాము ఆకారం గా భావించి దానికే పూజాదికాలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా బియ్యం బెల్లం తో చేసిన తీపి పదార్థాన్ని, అలాగే నువ్వులు, పప్పు బెల్లంతో చేసిన పదార్థాలను నివేదనగా చెల్లిస్తారు.అంతే కాకుండా కొందరు మహిళలు ఆ రోజు ఉపవాస దీక్ష కూడా పాటిస్తారు.కార్తీకమాసంలో వచ్చే మొదటి పండుగ ఇదే అని దాదాపు చాలా మందికి తెలుసు.అందుకోసమే ఈ పండుగను ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube