ఈ లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుంటే.. ఆ ఇంట్లోకి సిరి సంపదలతో పాటు..

ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రజలందరూ ధనవంతులు కావాలని ప్రతి రోజు దేవుని పూజిస్తూ ఉంటారు.దీని కోసం ప్రజలు రాత్రి, పగలు అని చూడకుండా కష్టపడి పని చేస్తూ ఉంటారు.

 By Placing A Idol Of Goddess Lakshmi Seated On A Lotus Flower In The Home Fina-TeluguStop.com

కానీ వారు ఆశించిన డబ్బును సంపాదించలేరు.ఇలా జరగడం వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

దీనితో పాటు రుణం తీసుకుని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అటువంటి పరిస్థితులలో మీరు కూడా ఆర్థిక సమస్యల( Financial problems )తో పోరాడుతున్నారా,అయితే దాని నుంచి బయట పడాలంటే వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి.

వాస్తు నియమాల ప్రకారం నడుచుకోవడం వల్ల చాలా రకాల ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు.మీరు వాస్తును నమ్మితే లక్ష్మీదేవి విగ్రహం, చిత్రాన్ని సరైన దిశలో ఇంట్లో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమైపోతాయి.అలాగే ఆ ఇంటి పై లక్ష్మి దేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.కాబట్టి ఇంట్లో ఎలాంటి లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఇలాంటి లక్ష్మి విగ్రహాన్ని( Lakshmi Devi ) ఇంట్లో ఉంచడం వల్ల సిరిసంపదలు రావడంతో పాటు ఆర్థిక సమస్యలు దూరమై, కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో తామర పువ్వు పై కూర్చున్న లక్ష్మీదేవి బొమ్మ లేదా విగ్రహాన్ని ఉంచడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో ఎప్పుడూ నివసిస్తూ ఉంటుంది.

అంతేకాకుండా సంపదకు ఎటువంటి లోటు ఉండదు.బంగారం, వెండి మొదలైనవి కూడా మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయి.దీనితో పాటు లక్ష్మీ అనుగ్రహంతో ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కూడా ఉంటుంది.

అంతేకాకుండా మీరు ఇంట్లో లక్ష్మీ చిత్రాన్ని కూడా ఉంచవచ్చు.ఇందులో ఏనుగు( Elephant )తో కలిసి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచితే ఎంతో మంచిది.ఈ బొమ్మను ఇంట్లో ఉంచుకుంటే శుభం జరుగుతుందని చాలామంది పెద్దవారు నమ్ముతారు.

అయితే పొరపాటున కూడా లక్ష్మీదేవి నిలబడి ఉన్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని అస్సలు పెట్టకూడదని చాలామంది చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube