కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలతో పాటు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన సునీతారెడ్డి వాదనలపై ఆసక్తి నెలకొంది.
నిన్నటి విచారణలో భాగంగా ఇద్దరి తరపు న్యాయవాదుల వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి.కాగా ఈ పిటిషన్ పై ఇవాళ సీబీఐ వాదనలు వినిపించనుంది.
ఈ నేపథ్యంలో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సర్వత్రా ఉత్కంత నెలకొంది.







