సురేందర్ రెడ్డితో పీస్ఫుల్ గా మంతనాలు జరుపుతున్న ఏజెంట్!
TeluguStop.com
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరోలో అక్కినేని అఖిల్ ఒకరు.ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని అఖిల్ చాలా మేకోవర్ అయ్యాడు.
లుక్ పూర్తిగా మార్చేశాడు.ఇందులో స్పై పాత్రలో నటిస్తున్న అఖిల్ లుక్ మీద ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ వచ్చాయి.
కండలు తిరిగిన బాడీతో గుబురు గడ్డంతో ఒత్తయిన జుట్టుతో అఖిల్ హాలీవుడ్ హీరోలా కనిపిస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతున్నాడు.
ఈ సినిమా మొత్తం హాలీవుడ్ యాక్షన్ రేంజ్ లో విన్యాసాలు ఉండబోతున్నాయని ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ధీమాగా ఉన్నారు.
"""/"//di
తాజాగా అఖిల్ సురేందర్ రెడ్డితో పీస్ ఫుల్ గా కూర్చుని మంతనాలు జరుపుతున్న ఫోటో ఒకటి షేర్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇంత రహస్యంగా వీరిద్దరూ ఏం మంతనాలు జరుపుతున్నారా అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి అందులో వచ్చే యాక్షన్ సన్నివేశాలను గురించి పీస్ ఫుల్ గా కూర్చుని చర్చిస్తునట్టుగా అనిపిస్తుంది.
"""/"//di
డిస్కసింగ్ ఫైర్ ఇన్ పీస్ ఏజెంట్ లోడింగ్ అంటూ అఖిల్ ఈ ఫొటోకు క్యాప్షన్ కాజోడించడంతో ఖచ్చితంగా సీరియస్ గా చర్చించు కుంటున్నారు అని అనిపిస్తుంది.
ఏజెంట్ లో అఖిల్ స్పై క్యారెక్టర్ చేస్తున్నాడు కాబట్టి పీస్ ఫుఉల్ గా కూర్చుని యాక్షన్ సన్నివేశాల గురించి ఇద్దరు మంతనాలు సాగిస్తున్నట్టుగా ఉంది.
ఈ సినిమాతో అయినా అఖిల్ కమర్షియల్ హిట్ అందుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే.
థాయ్‌లాండ్: ఫుల్ మూన్ పార్టీ గురించి ఈ నిజాలు తెలిస్తే వాంతి చేసుకుంటారు..