తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లే విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అవుతూ, పార్టీలో చేరికలు లేకపోయినా రాబోయే ఎన్నికల్లో తమ ప్రభావం తప్పకుండా ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.మొదట్లో ఈ పార్టీని ఎవరు పెద్దగా పట్టించుకోనట్టుగానే వ్యవహరించారు.
రాబోయే ఎన్నికల్లోను షర్మిల పార్టీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుందని అంచనాలు ఉన్నాయి.అయినా షర్మిల మాత్రం అధికార పార్టీ టిఆర్ఎస్ ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారు.
పాదయాత్ర, నిరుద్యోగుల ఆందోళనలు, ప్రజాపోరాటాలు వంటివి చేపట్టడంలో షర్మిల యాక్టివ్ గా ఉంటున్నారు.మొదట్లో షర్మిల పార్టీకి ప్రజల నుంచి ఆదరణ అంతంత మాత్రమే అన్నట్టు గా కనిపించినా, ఈ మధ్యకాలంలో షర్మిల యాత్రలకు జనాలు బాగానే హాజరు అవుతుండడం, ప్రజా సమస్యల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పైన, మంత్రులు ఎమ్మెల్యేల పైన తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్న తీరు , ఇవన్నీ జనాల్లోకి వెళుతుండడంతో అధికార పార్టీ టిఆర్ఎస్ కంగారు పడుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల మంత్రులు ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సీరియస్ అయింది.ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేయడం , ఆయన దానికి సానుకూలంగా స్పందించడం, త్వరలోనే ప్రివిలేజ్ కమిటీ షర్మిల పిలిపించి మాట్లాడడం , ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుండడంతో, అసలు మొదట్లో షర్మిలను పట్టించుకోనట్లుగా టిఆర్ఎస్ అగ్ర నేతలు వ్యవహరించారు.
తీవ్ర పదజాలంతో ఆమె విమర్శలు చేసినా, టిఆర్ఎస్ నేతలు స్పందించేవారు కాదు .అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులపై చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకొని ఆమెపై చర్యలకు పట్టుబడుతుండడం పై అందరికీ అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

షర్మిల పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.మొదట్లో ఆమె ప్రసంగాలు, పాదయాత్ర వల్ల పెద్దగా ప్రభావం ఉండదని టీఆర్ఎస్ నేతలు అంచనా వేసినా, ఈ మధ్యకాలంలో ఆమెకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుండడం, అదే పనిగా విమర్శలు చేస్తుండడం, దానికి ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తూ ఉండడంతో .ఆమె విషయంలో కఠినంగానే వ్యవహరించాలని టిఆర్ఎస్ అగ్ర నేతలు నిర్ణయించుకున్నట్లుగా ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్ధం అవుతోంది.







