'ఆచార్య' నుండి మొదటి పాట రాబోతుంది, ఎప్పుడో తెలుసా?

మెగాస్టార్‌ చిరంజీవి సైరా సినిమా తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రాబోతున్న ఆచార్య పై అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి.కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందడం ఒక కారణం అయితే రామ్‌ చరణ్‌ ప్రత్యేక పాత్రలో కనిపించడం ఒక కారణం.

 Chiranjeevi And Ram Charan Acharya Movie First Song Update , Acharya, Chiranjeev-TeluguStop.com

ఇక మెగాస్టార్ సినిమా అవ్వడం అనేది అతి పెద్ద కారణం అని చెప్పడంలో సందేహం లేదు.అద్బుతమైన ఈ కాంబోలో రాబోతున్న సినిమా మహాద్బుతంగా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు ఒక్కొక్కటి చొప్పున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి.ఈనెల 31న మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లుగా మాకు విశ్వసనీయ సమాచారం అందింది.

ఒకటి రెండు రోజుల్లో ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు గాను మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.వచ్చే నెల ఆరంభంలో సినిమా చివరి షెడ్యూల్‌ ను పూర్తి చేయబోతున్నారు.ఆ తర్వాత సినిమా ప్రమోషన్ ను మరింత జోరుగా చేయబోతున్నారు.మెగాస్టార్‌ చిరంజీవి పాటలు అంటే అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు చాలా ఆసక్తిని కనబర్చుతూ ఉంటారు.

కనుక సినిమా విషయమై అంచనాలు పెంచే విధంగా పాటలు ఉండాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు కొరటాల శివ మొదటి సారి మణిశర్మతో చేసినా కూడా చాలా కష్టపడి పాటలు చేయించాడు అంటున్నారు.మొదటి పాట విడుదల తర్వాత సినిమాపై ఖచ్చితంగా ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగే అవకాశం ఉందంటున్నారు.

ఈ సినిమాలో చిరు కు జోడీగా కాజల్ నటిస్తున్న విషయం తెలిసిందే.రామ్ చరణ్ పాత్రపై అంచనాలు ఆకాశం తాకేలా ఉన్నాయి.

కొరటాల శివ కెరీర్ లో ఇది మరో బిగ్గెస్ట్ అన్నట్లుగా ఉంటుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube