జైలర్ మరియు జవాన్( Jailer , Jawan ) సినిమాల తర్వాత తమిళ్ మరియు తెలుగు సినిమాలకు ఇప్పుడు కనిపిస్తున్న ఏకైక ఆప్షన్ అనిరుద్ రవి చంద్రన్.కేవలం బీజీఎమ్ తోనే సినిమాను మరొక రేంజ్ కి తీసుకెళ్లడం లో అనిరుద్ ఆరి తేరి పోయాడు.
జైలర్ విజయం సాధించిన తర్వాత రజినీ కాంత్ చెప్పిన మాటలను కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి.అనిరుద్ లేకపోతే జైలర్ ఒక యావరేజ్ సినిమా అని, అతడు బ్యాగ్రౌండ్ స్కోర్ చేశాకే ఆ సినిమా హిట్ సినిమాగా మారిపోయింది అని చెప్పారు.
అయితే ఇంత డిమాండ్ ఉన్న అనిరుద్ తెలుగు సినిమాలను ఎందుకు పట్టించుకోవడం లేదు.? ఆయన్ని ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ భరించలేక పోతున్నారా ? లేక తమిళం( Tamil ) లోనే ఎక్కువ సినిమాలకు బుక్ అవ్వడం తో తెలుగు వైపు చూసే టైం దొరకడం లేదా అనే ప్రశ్న ఎదురు అవుతుంది.

అయితే ప్రస్తుతం అనిరుద్ తెలుగులో కేవలం రెండు సినిమాలకు మాత్రమే సంగీతం సమకూరుస్తున్నారు.అందులో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర చిత్రం( Devara ).మరొకటి విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తూ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో వస్తున్న చిత్రం.ఈ రెండు మిన్నగా మరే తెలుగు సినిమా కూడా ఒప్పుకోవడం లేదు అనిరుష్.
ప్రస్తుతానికి అనిరుద్ కి 2023 తో పాటు, 2024 మరియు 2025 లో కూడా విడుదలకు సిద్ధం చేయాల్సిన సినిమాలు ఉన్నాయ్ .వాటికి సంగీతం సమకూర్చే పనిలోనే ఉన్నాడు అనిరుద్.

ఇక అనిరుద్ రవిచంద్రన్ కి ఒక్కో సినిమా కి 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు పారితోషకం గా ముట్టచెప్పాల్సి వస్తుంది.పెద్ద సినిమాల వరకు అయితే ఈ బడ్జెట్ పర్వాలేదు.కానీ చిన్న మరియు మీడియం సినిమాల విషయానికి వచ్చే సరికి ఈ బడ్జెట్ మొత్తం సంగీతానికి పెట్టేస్తే సినిమా తీయలేరు.అందువల్ల తెలుగు ల పెద్ద చిత్రాలు రెండు మినహా ఇంకా వేరే సినిమాలను చేయడం లేదు.
మరో వైపు ఏ ఆర్ రెహమాన్ తర్వాత అత్యంత ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న సంగీత దర్శకుడిగా అనిరుద్ రికార్డు సృష్టించాడు.







