కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోమవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.కాంగ్రెస్ అధ్యక్షుడిగా శశిథరూర్ రేసులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.కాంగ్రెస్‌లో అక్టోబరులో అంతర్గత ఎన్నికలు జరగబోతున్నాయి.ఈసారి గాంధీ కుటుంబం కాకుండా మరొకరు కాంగ్రెస్ అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది.అయితే కాంగ్రెస్‌లోని ఓ వర్గం మాత్రం రాహుల్‌గాంధీనే అధ్యక్ష పదవి చేపట్టాలని ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి.ఇప్పటి వరకు, కాంగ్రెస్‌కు చెందిన మూడు రాష్ట్ర కమిటీలు కూడా దీనికి సంబంధించి తీర్మానాన్ని ఆమోదించాయి.
మరికొన్ని రాష్ట్ర కమిటిలో ఇదే ప్రతిపాదన చేస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.శశి థరూర్ G-23 సభ్యుడు.
పార్టీ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఎన్నికలు జరగడాన్ని తను స్వాగతిస్తున్నట్లు.
ఇది పార్టీ గొప్ప నిర్ణయంగా తాను భావిస్తున్నట్లు తెలిపారు.

ఇక అంతకుముందు, పార్టీలో సంస్కరణలకు సంబందించి దాఖలైన పిటిషన్‌కు ఆయన అంగీకరించారు.ఈ పిటిషన్‌ను యువజన కాంగ్రెస్ సభ్యులు ప్రారంభించారు.ఇందులో పార్టీని సంస్కరించడంతో పాటు ‘ఉదయ్‌పూర్ డిక్లరేషన్’ అమలుపై సంబంధించిన నిర్ణయాలను పెర్కొన్నారు.
ఉదయపూర్ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ నాయకత్వం మేలో ఆమోదించింది.ఇందులో, పార్టీలో అంతర్గత ఎన్నికల్లో న్యాయబద్ధత, ఒక కుటుంబం నుండి ఒక అభ్యర్థికి ఐదేళ్లు, ఒక వ్యక్తికి ఒక పదవి, అన్ని పదవులకు కాల పరిమితిని నిర్ణయించడం వంటి అంశాలు ఉన్నాయి.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఈ పిటిషన్‌ను ట్విట్టర్‌లో పంచుకున్నారు, దీనిపై ఇప్పటివరకు 650 మందికి పైగా సంతకాలు చేశారు.అలాగే, యూత్ కాంగ్రెస్ సభ్యులు నిర్వహిస్తున్న ఈ పిటిషన్‌ను నేను స్వాగతిస్తున్నాను అని థరూర్ ట్విటర్ పోస్టు ద్వారా తెలియజేశారు.” నిర్మాణాత్మక మార్పు రావాలనే డిమాండ్ పార్టీలో నెలకొంది.దీనిపై ఇప్పటివరకు 650 మందికి పైగా సంతకాలు చేశారు.
నేను దీన్ని షేర్ చేయడం సంతోషంగా ఉంది.ఇది మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను” ట్విట్ చేశారు.
చూడాలి చివరికి కాంగ్రెస్ అధినాయకత్వం ఎవరిని అధక్షుడిగా నిర్ణయిస్తోందో.







