మన భారత దేశంలో ఎన్నో పురాతన పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి.ఈ పుణ్య క్షేత్రాలకు ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలి వచ్చి పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ తిరుమల పుణ్య క్షేత్రానికి( Tirumala ) ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.అందుకోసం తిరుమల పుణ్య క్షేత్రంలో ఎప్పుడూ భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంటుంది.
తాజాగా తిరుమలలో ఈ రెండు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా చెప్పాలంటే మార్చి నెల 22వ తేదీన తెలుగు సంవత్సరాది, అనగా ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 21,మార్చి 22 వ తేదీలలో తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలను(VIP Break Darshan) రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
ఉగాది సందర్భంగా ఆ రెండు రోజులు ఎవరి సిఫారసు లేఖల్ని స్వీకరించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) స్పష్టం చేసింది.
అంతే కాకుండా మార్చి నెల 22వ తేదీన శ్రీవారి సన్నిధిలో బంగారు వాకిలి వద్ద ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు.ఉగాది పర్వదినం రోజున సుప్రభాత సేవ తరువాత దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నట్లు దేవాలయ అధికారులు వెల్లడించారు.మార్చి 22వ తేదీన ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి విష్వక్సేనులకు విశేష సమర్పణ ఉంటుంది.
అంతే కాకుండా ఏడు గంటల నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం, చుట్టూ ఊరేగింపుగా దేవాలయ ప్రవేశం చేస్తారు.తరువాత స్వామి వారి విరాట్టు ను, ఉత్సవ మూర్తులను నూతన వస్త్రాలతో అలంకరించి పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.