హైదరాబాద్ లోని ఎన్ఐఎస్ఏలో తెలంగాణ బీజేపీ నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ వంటి ప్రధాన నేతలతో భేటీ నిర్వహించారు.
తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది.గత నెల 28న ఢిల్లీ పిలిపించుకున్న షా తెలంగాణ నాయకులకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.