యువరాజ్ సింగ్ రికార్డునే బద్దలు కొట్టిన యువ బ్యాటర్.. 9బంతుల్లోనే హాఫ్ సెంచరీ..!

క్రికెట్ లో ఎవరు బద్దలు కొట్టలేని సరికొత్త రికార్డులు అప్పుడప్పుడు నమోదు అవుతుంటాయి.ఆసియా క్రీడల్లో( Asian Games ) భాగంగా నేపాల్ క్రికెట్ జట్టు కొన్ని అద్భుతమైన రికార్డులు నెలకొల్పి, పలువురి పై ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది.

 Nepal Dipendra Singh Creates History Hits 50 In 9 Balls Details, Nepal, Dipendra-TeluguStop.com

నేపాల్ జట్టు ప్లేయర్ దీపేంద్ర సింగ్( Dipendra Singh ) 9 బంతులలో అర్థ సెంచరీ చేసి అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా కొత్త రికార్డు సృష్టించాడు.

గతంలో ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచరీ చేసిన రికార్డు యువరాజ్ సింగ్( Yuvraj Singh ) పేరిట ఉండేది.2007 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ పై ఆడిన మ్యాచ్లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో ఆప్ సెంచరీ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.ఆ మ్యాచ్ లోనే ఒకే ఓవర్ లో 6 బంతులకు ఆరు సిక్సులు కొట్టి యువరాజ్ మరో సరికొత్త అరుదైన రికార్డును కూడా నెలకొల్పాడు.

Telugu Balls, Asian Games, Dipendra Singh, Century, Nepal, Nepal Cricket, Nepal

తాజాగా ఆసియా క్రీడల్లో నేపాల్ కి ( Nepal ) చెందిన దీపేంద్ర సింగ్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.ఆసియా క్రీడల్లో భాగంగా నేపాల్ – మంగోలియా కి మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 314 భారీ పరుగులను చేసింది.టీ20 ఫార్మాట్లో ఒక ఇన్నింగ్స్ లో హైయెస్ట్ స్కోర్ కూడా ఇదే కావడం విశేషం.టీ20 ఫార్మాట్లో 300+ పైగా పరుగులు చేసిన ఏకైక టీం గా వరల్డ్ క్రికెట్లోనే నేపాల్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

Telugu Balls, Asian Games, Dipendra Singh, Century, Nepal, Nepal Cricket, Nepal

అనంతరం లక్ష్య చేదనకు దిగిన మంగోలియా జట్టు( Mangolia ) 41 పరుగులకే ఆల్ అవుట్ అయింది.దీంతో టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా నేపాల్ ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.అంతేకాదు నేపాల్ 26 సిక్స్ లతో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సులు కొట్టిన జట్టుగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube