ఈ శ్రీకృష్ణుడి చిత్రం.. మీ అదృష్టాన్ని మారుస్తుందా..

భగవంతుడు ఇంట్లోనే కాదు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, డైనింగ్ హాలులో, టీవీ హాల్లో, కిచెన్ లో మనకు నచ్చిన చోట భగవంతుని చిత్రాన్ని పెడుతూ ఉంటాము.దాదాపు అందరి ఇళ్ళలో భగవంతుని చిత్రపటాన్ని పూజిస్తూ ఉంటారు.

 Will This Picture Of Lord Krishna Change Your Luck , Picture Of Lord Krishna ,-TeluguStop.com

విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.జీవితంలో ప్రేమ లభిస్తుందని చాలామంది నమ్ముతారు.

ఇంట్లో కృష్ణుడి విగ్రహం లేదా చిత్రం ఉంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని చాలా గ్రంధాలలో వెల్లడించారు.వాస్తు శాస్త్రంలో కూడా కృష్ణుడి చిత్రాలు ఇంట్లో వాస్తు దోషాన్ని తొలగిస్తాయని చెబుతూ ఉంటారు.

ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కృష్ణుడి ఫోటోలను ఇంట్లో ఉంచడం వల్ల శత్రువులను జయించాలి అనుకునేవారు, ఇంట్లో కళింగ పై నిలబడి ఉన్న కృష్ణుడి ఫోటోను ఉంచడం మంచిది.

కృష్ణుడు చాలా మంది రాక్షసులను ఓడించాడు.ఈ ఫోటో ఇంట్లో ఉంటే శత్రువులను ఓడించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

కురుక్షేత్ర యుద్ధం ఫోటోను పోస్ట్ చేయకూడదని గ్రంధాలలో చెప్పబడింది.

ఇది ఇంట్లో సందడిని పెంచి శాంతికి భంగం కలిగిస్తుంది.కురుక్షేత్రంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఉన్న ఫోటో ఇంట్లో పెట్టవచ్చు.ఇది మీకు సరైన మరియు తప్పుల గురించి అవగాహన కలిగిస్తుంది.

ఇది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇది మీలోనే ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.

మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకుని ఉన్న ఫోటో ఉంటే ఇంటి వాతావరణమే మారిపోతుంది.ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది.ఇంట్లో దుఃఖం దూరమైపోతుంది.ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది.మీరు ఫోటోకు బదులుగా ఇంట్లో వేణువును ఉంచడం కూడా ఉంచుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube