మన దేశంలో దాదాపు చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని గట్టిగా నమ్ముతారు.వారి ఇంట్లను కూడా వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.
ఇంటి నిర్మాణంలో వాస్తు దోషం ఉంటే ఇంట్లో ఉండే వ్యక్తుల పై ప్రభావం ఎలా పడుతుందో, ఇంట్లో ఉండే వస్తువులు వాటిని ఏర్పాటు చేసే దిశల వల్ల కూడా ప్రభావం ఉంటుందని చాలా మందికి తెలియదు.ముఖ్యంగా ఇంట్లో చెత్త కుండీని ఏర్పాటు చేసే దిశ ఇంట్లో వారి పై ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని దిక్కుల్లో ఎట్టి పరిస్థితుల్లో చెత్త కుండి నీ ఏర్పాటు చేయకూడదు అని చెబుతున్నారు.ఇంతకీ ఏ దిక్కులో చెత్త కుండి నీ ఏర్పాటు చేయకూడదు, చేస్తే ఎలాంటి చెడు ప్రవాలు ఏర్పడతాయి ఇప్పుడు తెలుసుకుందాం.అయితే వాస్తు ప్రకారం చెత్త కుండి నీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య దిశలో అసలు ఉంచకూడదు.ఈశాన్య దిక్కును దేవతల దిక్కుగా భావిస్తూ ఉంటారు.ఈ దిశలో చెత్త కుండిని ఉంచడం వల్ల ఇంటి సభ్యులపై చెడు ప్రభావం పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

దీని వల్ల ఇంట్లో వాస్తు దోషం ఏర్పడే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే తూర్పు, ఆగ్నేయం, ఉత్తరం దిశలలో ఎప్పటికీ ఉంచకూడదు.
దీంతో కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.అయితే చెత్తకుండీ నీ ఏర్పాటు చేయడానికి వాస్తు శాస్త్రం లో ప్రత్యేకంగా ఒక దిశ నిర్దేశించి ఉంది.
వాయువ్య మరియు నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోవచ్చు.అంతేకాకుండా ఇంటికి లోపల ఏర్పాటు చేయాలని చెబుతూ ఉంటారు.