సర్వేజనా సుఖినోభవన్తు. లోకాసమస్తా సుఖినోభవంతు అని ఎందుకు కోరుకోవాలి?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం చెట్టు, పట్ట, రాయి, రప్ప ఇలా ప్రతీ దానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తుంటారు.అందులో దేవుడున్నాడని నమ్ముతుంటారు.

 What Is The Meaning Of Sarvejana Sukhinobhavanthu And Lokasamastha Sukhinobhavan-TeluguStop.com

వాటిని పూజిస్తూ.అందరూ బాగుండాలని కోరుకుంటారు.

అంతే కాదండోయ్ అందరూ బాగుండాలి.అందులో నేనుండాలి అనుకునే వాళ్లు కూడా చాలా మందే ఉంటారు.

అలా అనుకోవడం ఇప్పటి నుంచే లేదు.పురాతన కాలం నుంచే ఉంది.

ఆ దేవుడిని ప్రార్థించేటప్పుడు సర్వేజనా సుఖినో భవంతు, లోకాసమస్తా సుఖినోభవంతు అంటూ మనసులోనే దైవ నామస్మరణ చేసుకునేవారు.

లోకంలో మనం బాగుండాలి, బాగున్నాం! అనుకోకండి, మన చుట్టు వున్న సంఘం కరువు దరిద్రములతో బాధపడుతున్నారు అనుకుందాం, వారి దృష్టి ఎలావుంటుంది.

దరిద్రంలోవున్న ప్రజలు వారి కనీస అవసరాలు తీర్చుకోవడం కోసం దోపిడీలకు, దొంగతనాలకు అలవాటుపడే అవకాశం ఉంది.వారు అలా ప్రవర్తించడం వలన వారు మన మీదకు దోపిడీకి వచ్చే అవకాశం ఉంది.

అనే భయంతో మనం జీవించాల్సి వుంటుంది.అందువలన మన చుట్టూ ఉన్న సంఘం బాగుంటే మనకు ఎటువంటి ప్రమాదాలు, భయాలు, ఉండవు.

సత్సంగం, సంఘస్సత్సు విధీయతాం సత్సంగత్యే నిస్సంగత్యం ఇలా ఎన్నో వాక్యాల గూఢార్థాలు కూడా యివే.అందు కోసమే “సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అని కోరుకోవాలి.

అప్పుడే అందరితో పాటు మనం కూడా బాగుంటాం.అలాగే పక్క వాళ్ల బాగు చూస్తేనే దేవుడు మనకు మంచి చేస్తాడు.

అది కూడా దృష్టిలో పెట్టుకొని మెలగండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube