ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారు.ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరనే చెప్పాలి.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోవడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి సైలెంట్‌గా ఉంటున్నారు.అయితే ఇటీవల ఆయన్ను అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు జరిపింది.ఆ వివరాలు బయటకు మాత్రం బహిర్గతం కాలేదు.2024 ఎన్నికల సమయానికి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసిన తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాలోని తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.తాజాగా తన సొంతమండలం కలికిరిలోనూ పర్యటించారు.ఒకప్పటి తన అనుచరులు కార్యకర్తలు నేతలను పేరుపేరునా పలకరించారు.ఈ పర్యటనలో కిరణ్ కుమార్ రెడ్డితోపాటు ఆయన కుమారుడు నిఖిలేష్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
కిరణ్ కుమార్‌రెడ్డి తన కుమారుడిని కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ పరిచయం చేశారు.ప్రస్తుతం నిఖిలేష్‌కుమార్ రెడ్డి చదువు పూర్తి చేసుకున్నారు.
దీంతో త్వరలోనే ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
అటు కిరణ్‌కుమార్‌రెడ్డికి సోదరుడు కూడా ఉన్నారు.
కిరణ్ సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున రాజకీయాల్లో పోటీ చేశారు.పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయగా ఓటమి పాలయ్యారు.
ప్రస్తుతం నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి కూడా రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరనే చెప్పాలి.ఈ నేపథ్యంలో కిరణ్ తన కుమారుడిని రంగంలోకి దించుతారా అంటూ కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రోశయ్యను సీఎం చేయగా.తెలంగాణ ఉద్యమం వేడి కారణంగా ఆయన ఏడాది కూడా పదవిలో ఉండలేకపోయారు.ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు.అప్పటిదాకా ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఒక్కసారి కూడా మంత్రి కాలేకపోయారు.అయితే స్పీకర్ కాగలిగారు.స్పీకర్‌గా ఉన్న ఆయన్ను కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిని చేసింది.
దాదాపు మూడేళ్లకుపైగా కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.రాష్ట్ర విభజన తర్వాత జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీని ఏర్పాటు చేసి 2014 ఎన్నికల్లో పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు.







