హైదరాబాద్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు.అనంతరం ఆయన హరిత హోటల్ కు చేరుకున్నారు.
అక్కడ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.అంతకముందు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తో ఆయన భేటీ అయ్యారు.
అయితే క్రీడలకు సంబంధించిన విషయాలపై మాత్రమే చర్చ జరిగినట్లు సమాచారం.ఇటీవలే అమిత్ షా పలువురు సినీ నటులు, క్రీడాకారులతో సమావేశమైయ్యారు.
ఈ క్రమంలో వీరి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







