కృష్ణ మొదటి భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అంత్యక్రియలు కొంతసేపటి క్రితం ముగిశాయి.ఇందిరా దేవి మరణం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెట్టింది.
సాధారణంగా ఏ భార్య అయినా తను బ్రతికి ఉన్న సమయంలో భర్త మరో పెళ్లి చేసుకుంటే అస్సలు సహించదనే సంగతి తెలిసిందే.అయితే కృష్ణ విజయనిర్మలను పెళ్లి చేసుకున్నా ఇందిరా దేవి మాత్రం కృష్ణ రెండో పెళ్లిని గౌరవించారు.
కృష్ణ విజయనిర్మలను పెళ్లి చేసుకున్నానని ఇందిరా దేవికి చెప్పగా రెండో పెళ్లి జరిగినా నేను భార్యగానే కొనసాగుతానని ఆమె భర్తకు చెప్పినట్టు సమాచారం.కృష్ణ నిర్ణయం ఆమెను బాధ పెట్టినా కృష్ణను హర్ట్ చేయడం ఇష్టం లేక ఆమె ఈ విధంగా వ్యవహరించారని సమాచారం అందుతోంది.
కృష్ణ రెండో పెళ్లి అనంతరం ఇందిరా దేవి మీడియాకు దూరంగా ఉన్నారు.బంధువుల ఫంక్షన్లలో మాత్రం పాల్గొనడానికి ఆమె ఆసక్తి చూపేవారని సమాచారం.
ఇతరులకు మంచి చేయడం మాత్రమే ఇందిరా దేవికి తెలుసని ఆమె గురించి తెలిసిన వాళ్లు చెబుతుండటం గమనార్హం.కుటుంబానికి, పిల్లలకు ఆమె ఎంతో ప్రాధాన్యతనిచ్చారు.
పిల్లలకు ఫ్రీడమ్ ఇస్తూనే పిల్లలు పెద్దలను గౌరవించేలా కెరీర్ పరంగా ఎదిగేలా ఇందిరా దేవి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని బోగట్టా.కృష్ణ ఆరోగ్యం విషయంలో కూడా ఇందిరా దేవి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం.
ఏడు పదుల వయస్సులో ఇందిరా దేవి మరణించగా ఆమె మరణ వార్త విని సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.భార్య మరణంతో కృష్ణను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదని తెలుస్తోంది.తండ్రి ఓదార్చినా సితార మాత్రం దుఃఖాన్ని ఆపులేకపోయారని సమాచారం.ఇందిరా దేవి మరణంతో మహేష్ కొంతకాలం పాటు షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చినట్టు బోగట్టా.