ముఖ చర్మం ట్యాన్ అయ్యిందా? కాంతిహీనంగా మారిందా? అయితే ఇలా చేయండి!

సాధారణంగా సమ్మర్ సీజన్ లోనే చర్మం ట్యాన్ అవుతుందని చాలా మంది భావిస్తుంటారు.అందుకే సమ్మర్ సీజ‌న్ లో మాత్ర‌మే సన్ స్క్రీన్ లోషన్స్ ను వాడుతుంటారు.

 If You Follow This Tip, The Tan Will Be Removed And The Skin Will Become Bright!-TeluguStop.com

కానీ ఏ సీజన్ లో అయినా చర్మం ట్యాన్ కు గురవుతుంది.ట్యాన్ అవడం వల్ల చర్మం కాంతిహీనంగా మారుతుంది.

మీరు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కా మీకు ఎంతగానో సహాయపడుతుంది.ఈ చిట్కాను పాటిస్తే ఒక్క దెబ్బతోనే ట్యాన్ పోయి చర్మం కాంతివంతంగా మ‌రియు నిగారింపుగా మారుతుంది.

మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక క‌ప్పు కొబ్బ‌రి ముక్క‌లు, ఒక క‌ప్పు వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుంచి ప‌ల్చ‌టి వ‌స్త్రం స‌హాయంతో కొబ్బ‌రి పాల‌ను ఫిల్ట‌ర్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్, హాఫ్‌ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని స్పూన్ స‌హాయంతో బాగా కలుపుకోవాలి.

చివరగా సరిపడా కొబ్బరి పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వేళ్ళతో సున్నితంగా స్క్రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ చిట్కాను పాటించడం వల్ల ట్యాన్ తొలగిపోయి చర్మం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.

అలాగే మొండి మచ్చలు వదిలించడానికి సైతం ఈ చిట్కా అద్భుతంగా సహాయపడుతుంది.రెండు రోజులకు ఒకసారి ఈ చిట్కాను పాటిస్తే మచ్చలు క్రమంగా మాయం అవుతాయి.అలాగే స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.మొటిమలు తరచూ వేధించకుండా ఉంటాయి.

మరియు చ‌ర్మం యవ్వనంగా సైతం మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube