ఒకప్పుడు ఇండస్ట్రీ లో మాస్ సినిమాలు చేయడానికి పెద్ద హీరో లు రెడీ గా ఉండేవారు లవ్ స్టోరీస్ చేయడానికి నాగార్జున లాంటి హీరో లు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండే వారు కానీ లవర్ బాయ్ క్యారెక్టర్ చేయడానికి కొంత మంది హీరో లు ఆసక్తి గా ఉండటమే కాకూండా మంచి పాత్రలు పోషిస్తూ జనాలని మెప్పించేవారు అయితే అప్పట్లో లవర్ బాయ్ ఇమేజిని సంపాదించుకున్న వాళ్లలో అబ్బాస్( Abbas ) ఒకరు ఈయన చేసిన ప్రేమదేశం అనే సినిమాతో ఈయనకి లవర్ బాయ్ ఇమేజ్ అయితే వచ్చింది.

ఇక ఈయన తో పాటు గా అప్పట్లో వినీత్( Vineeth ) కూడా లవర్ బాయ్ పాత్రల్లో సరిగ్గా సరిపోయేవాడు.ఇక వీళ్లిద్దరు అప్పట్లో అమ్మాయిల గుండెల్లో రాకుమారులు అనే చెప్పాలి.వీళ్లు ఏ సినిమా చేసిన అమ్మాయిలు విపరీతం గా ఆ సినిమాలు చూసేవారు.అందుకే ఇండస్ట్రీ లో ఎవరిదైనా కొద్దీ రోజులు మాత్రమే ఉంటుంది అని అంటూ ఉంటారు…

అయితే వీళ్ళిద్దరుకూడా ప్రేమదేశం( Prema Desam ) అనే సినిమాతో హీరోలు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.వీళ్ళని చూసిన చాలా మంది వీళ్లు చాలా ఈజీగా టాప్ హీరో లు అయిపోతారు అని అనుకున్నారు కానీ అప్పుడు వీళ్లిద్దరికీ వరుస ప్లాప్ లు పడటంతో వాళ్ళకి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు ఇక సినిమాల్లో హీరో గా అవకాశాలు కూడా తగ్గిపోయాయి దాంతో హీరోలుగా ఫెడ్ అవుట్ అయిపోయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు ఇక అబ్బాస్ ప్రస్తుతం న్యూజిలాండ్( New Zealand) లో స్థిరపడిన విషయం మనకు తెలిసిందే…వినీత్ మాత్రం సినిమాల్లో కొన్ని ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ వస్తున్నారు…ఆయన చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది.అందుకే ఈయన చేసే సినిమాల్లో ఈయన క్యరెక్టర్ ని మాత్రం అందరు గుర్తు పెట్టుకుంటారు…








