మహాశివరాత్రి పండుగను మన దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.మహాశివరాత్రి రోజు పరమ శివుని కొసం భక్తులు ఉపవాస దీక్ష చేపట్టి, జాగరణ కూడా చేశారు.
ఈ జాగరణలో శివుని భక్తులు ప్రతిక్షణం పరమశివుని స్మరిస్తూ జాగరణ చేశారు.మహాశివరాత్రి రోజు శివుడి మెడలో ఉండే నాగపాము ఆ పరమేశ్వరుడి కళ్యాణం కోసం ఆయన ఆలయానికి వచ్చింది.
ఒకవైపు స్వామివారి కళ్యాణం మరోవైపు ఆలయంలోకి వచ్చిన నాగ పాము దర్శనంతో ఆ దేవాలయంలో సందడి వాతావరణం ఏర్పడింది.నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గొడిసేర్యాల్ దేవాలయంలో మహా అద్భుతం జరిగింది.
మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతులకు కళ్యాణం జరుగుతుండగా దేవాలయ గర్భగుడిలో నాగపాము దర్శనమిచ్చింది.నాగేంద్రున్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్ల ద్వారా బారులు తీరారు.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గొడిసేర్యాల్ శివాలయంలో మహాశివరాత్రి పర్వదినం రోజు రాత్రి 11 గంటల సమయంలో నాగ పాము ప్రత్యక్షమైంది.దీంతో నాగేంద్రుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా దేవాలయానికి తరలివచ్చారు.ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో శివరాత్రి రోజు నాగపాము దర్శనం ఇవ్వడం ఈ ఆలయ ప్రత్యేకత.దీని వల్ల ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి భక్తులు భారీ ఎత్తున ఆలయానికి తరలివచ్చి దేవాలయంలో జాగరణలు చేస్తూ నాగేంద్రుని దర్శించుకున్నారు.
మహా శివరాత్రి ఈ పర్వ దినం రోజున శివ నామస్మరణలతో దేవాలయ ప్రాంగణం లో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.ఇలా నాగపాము రావడం ఆ నాగేంద్రుని దర్శించుకోవడం తమకెంతో శుభదాయకమని భక్తులు చెబుతున్నారు.
మహా శివరాత్రి జాగరణలలో ఇలాంటి ఆటంకాలు లేకుండా భక్తులందరూ ఎంతో సంతోషంగా పండుగను జరుపుకున్నారు.
GENERAL-TELUGU