బిగ్ బాస్ షో( Bigg Boss Show ) ద్వారా ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న అరియానా ఆ షో ద్వారా వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీ అయ్యారు.అరియానాకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం ఊహించని స్థాయిలో పెరిగింది.
అమర్ దీప్ కోసం అరియానా వెక్కివెక్కి ఏడుస్తున్నారు.అమర్ దీప్( Amar Deep ) గురించి ఈ మధ్య కాలంలో నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి.
నాగార్జున సైతం అమర్ దీప్ ను టార్గెట్ చేసి తిడుతున్నారు.
అయితే అమర్ దీప్ పై ఊహించని స్థాయిలో ట్రోల్స్ రావడం అరియానాను( Ariyana ) బాధ పెట్టింది.అరియానా అమర్ దీప్ గురించి మాట్లాడుతూ అమర్ దీప్ ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ ఎమోషనల్ అయ్యారు.అమర్ దీప్ తన క్లోజ్ ఫ్రెండ్ కావడంతో అరియానా ఈ కామెంట్లు చేశారు.
అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లో టాప్5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలుస్తారో లేదో చూడాల్సి ఉందీ.అమర్ దీప్ విన్నర్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss Show Season 7 ) గత సీజన్స్ తో పోలిస్తే మెరుగైన రేటింగ్స్ ను అందుకుంటుండగా నాగ్ హోస్టింగ్ కూడా ఈ షోకు ప్లస్ అవుతోంది.బిగ్ బాస్ హౌస్ నుంచి అశ్విని ఈ వారం ఎలిమినేట్ కానున్నారని సమాచారం అందుతోంది.మొదట బిగ్ బాస్ హౌస్ నుంచి శోభా శెట్టి ఎలిమినేట్ అయినట్టు ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ వచ్చేసింది.బిగ్ బాస్ షో విజేత ఎవరనే ప్రశ్నకు సైతం వేర్వేరు పేర్లు సమాధానంగా వినిపిస్తుండగా ఎవరు విజేతగా నిలుస్తారో చూడాల్సి ఉంది.
శివాజీ, పల్లవి ప్రశాంత్ లలో ఎవరో ఒకరు బిగ్ బాస్ షో విజేతగా నిలుస్తారేమో చూడాల్సి ఉంది.