స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు( Chandrababu ) రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.చంద్రబాబు అరెస్ట్ పట్ల వివిధ పార్టీల నాయకులు పలువురు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఖండించడం జరిగింది.
అయితే జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం మొదటి నుండి చర్చినియాంశంగా మారింది.ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ పట్ల జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )స్పందించకపోవడంపై సినీ హీరో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
బుధవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీ నేతలతో బాలకృష్ణ ( Balakrishna )అత్యవసర భేటీ నిర్వహించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉండగా చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ మౌనం పై మీడియా ప్రతినిధులు బాలకృష్ణని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకి బాలయ్య సమాధానం తెలియజేస్తూ చంద్రబాబు అరెస్టు పట్ల ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అని సమాధానం ఇచ్చారు.
ఇక ఇదే సమయంలో.
సినిమా వాళ్ళు స్పందించకపోయిన తాను పట్టించుకోనని, చంద్రబాబు అరెస్టుపై తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తానని పేర్కొన్నారు.చంద్రబాబు అరెస్ట్ లో కేంద్ర ప్రభుత్వం హస్తము ఉందో లేదో తెలియదని వ్యాఖ్యానించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో( BJP president Purandeshwari ) తాను టచ్ లో ఉన్నట్లు బాలయ్య పేర్కొన్నారు.తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదన్న వారికి తామేంటో చూపిస్తామని, రాబోయే ఎన్నికలలో సత్తా చాటుతామని స్పష్టం చేశారు.
తాము అనవసరంగా ఎవరిపైనా నిందలు వెయ్యము అని చెప్పుకొచ్చారు.తెలంగాణ తెలుగుదేశం పార్టీకి తాను అండగా నిలుస్తానని స్పష్టం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు లాంటివి.తెలంగాణలో పొత్తుల విషయం చంద్రబాబు ఖరారు చేస్తారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.