ఒక సినిమా తీయాలంటే అంత ఆషామాసి విషయం కాదు.ఎంతోమంది నటీనటులకు కథను ఒప్పించాలి.
అలాగే సినిమా తీయడానికి దర్శకుడు, నిర్మాత.ఇలా అనేక మంది టెక్నీషియన్లు అవసరం పడతారు.
కొన్ని కాంబినేషన్స్ అంత త్వరగా సెట్ అవ్వవు.ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఏదో ఒక సమస్య వల్ల ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోతుంటాయి.ఇలాంటి సందర్భం హీరో ప్రభాస్, టాలీవుడ్ అగ్ర దర్శకుడైన రాజమౌళి ల మధ్య కూడా జరిగింది.2005 సంవత్సరంలో చత్రపతి సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.అయితే ఈ సినిమా తీయడానికి కొన్ని సంవత్సరాల నిరీక్షణ దాగి ఉంది.2001లో రాజమౌళి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ వన్( Student No.1 ) విడుదల అయింది.ఆ సినిమా తర్వాత ఆయన రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు.
ఇకపోతే ప్రభాస్ అదే సమయంలో సినీ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడన్న విషయం తెలుసుకొని ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాడు రాజమౌళి.కాకపోతే అప్పటి పరిస్థితులు కుదరకపోవడంతో ప్రభాస్ రాఘవేంద్ర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టాడు.
ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి 2003లో రాజమౌళి సింహాద్రి సినిమా( Simhadri ) చేశాడు.ఇలా ప్రభాస్ తో సినిమా చేయాలన్న కోరిక అలాగే సాగుతూ వచ్చింది.

అలా సమయం గడిచే కొద్ది ప్రభాస్( Prabhas ) 5 సినిమాలలో హీరోగా నటించిన తర్వాత రాజమౌళి ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం దక్కింది.నిర్మాత ప్రసాద్ రాజమౌళి కుటుంబానికి చాలా సుపరిచితుడు.అదే సమయంలో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్న రాజమౌళి( Rajamouli )తో కలిసి సినిమా తీయాలని భావించాడు.దీంతో నిర్మాత ప్రసాద్ రాజమౌళితో కలిసి సినిమా చేద్దామని తెలిపారు.
దాంతో రాజమౌళి తన తండ్రి విజయేంద్రప్రసాద్ కి తల్లి కొడుకుల మధ్య సెంటిమెంట్ తో సాగే సినిమా కథ తయారు చేయమని తెలిపారు.అలా సినిమా కథ కోసం ఆలోచిస్తున్న సమయంలో 1988లో విజయేంద్ర ప్రసాద్ చూసిన స్కార్ రేస్ అనే సినిమా గుర్తుకు వచ్చింది.
అందులోని సెంటిమెంట్ సన్నివేశాలు అతనికి బాగా నచ్చాయి.దీంతో ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో సినిమాకి స్టోరీ దొరికిందని ఆయన సంబరపడ్డారు.దాంతో ఆ సమయంలో కథను వినిపించడానికి నిద్రపోతున్న భార్యని కాస్త నిద్రలేపి స్టోరీ చెప్పాడు.అయితే స్టోరీ చెప్పి విజయేంద్రప్రసాద్ ప్రశాంతంగా నిద్రపోగా.
, స్టోరీ విన్న భార్య మాత్రం అలా ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఆ తర్వాత మరుసటి రోజు విజయేంద్రప్రసాద్( Vijayendra Prasadd ) సినిమా కథని ఆఫీసులో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ కు, అలాగే నిర్మాతకు వినిపించాడు.అదే సమయంలో పద్మాలయ స్టూడియోస్( Padmalaya Studios ) లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న గోపి అనే వ్యక్తి స్టోరీ విని భలే స్టోరీ సార్.కథ చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాకు ‘ చత్రపతి ‘( Chatrapati ) అనే సినిమా టైటిల్ ని పెట్టండి అంటూ సలహా ఇచ్చాడు.
దీనికి కారణం సినిమాలో తల్లి తన కొడుక్కి చత్రపతి కథలను చెబుతూ అతని ఇన్స్పైర్ గా మారుస్తుంది.ఆపై సినిమా కథ విన్న హీరో కథను మెచ్చి సినిమాను 12.5 కోట్లు పెట్టి తీసిన సినిమాను ఏకంగా 54 కేంద్రాల్లో వందరోజుల ప్రదర్శన జరిగేలా సినిమా ప్రభంజనం సృష్టించింది.అయితే సినిమా కథ వినగానే చత్రపతి అనే టైటిల్ ని చెప్పిన గోపి( Gopi ) మాత్రం సినిమా రిలీజ్ కాకముందే చనిపోయాడు.
ఇంత మంచి సినిమాకు టైటిల్ ని చెప్పిన గోపికి ఆర్థిక సాయం చేయాలని భావించిన చిత్ర యూనిట్ ఆయన చనిపోయారని తెలుసుకొని షాక్ గురయ్యారు.చివరికి ఆయన కుటుంబానికైనా ఆర్థిక సాయం చేయాలని శతవిదాల ప్రయత్నించిన ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎవరో అన్న విషయం ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు.