సినీ ఇండస్ట్రీలో నేషనల్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
కన్నడలో కిరిక్ పార్టీ(Kirik Party) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా వచ్చినటువంటి ఈమె మొదటి సినిమాను ఎంతో మంచి సక్సెస్ కావడంతో అనంతరం తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.ఇలా తెలుగులో సక్సెస్ అయినటువంటి రష్మిక తమిళం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక్కడ చిత్ర పరిశ్రమలో కిరిక్ పార్టీ సినిమాలో నటించినటువంటి నటుడు రక్షిత్ శెట్టి(Rakshith Shetty) తో ఈమె ప్రేమలో పడిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థపు వేడుక కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరి నిశ్చితార్థం బ్రేకప్ కావడంతో వీరిద్దరూ సినిమాల పరంగా బిజీ అయ్యారు.ఇక రక్షిత్ శెట్టి సైతం కన్నడ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి ఆదరణ సంపాదించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఈయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.తాజాగా రక్షిత్ శెట్టి సప్త సాగరాలు దాటి( Sapta Sagaralu Dhaati ) అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా నేడు విడుదలైంది.అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రష్మిక(Rashmika) తో మీరు ఇంకా టచ్ లో ఉన్నారా అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది అయితే ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ రష్మిక ఇప్పటికీ నాతో టచ్ లో ఉన్నారు ఆమె పెద్ద కలలు కనేది అయితే ఆ కలలు సహకారం అవుతున్నందుకు తనని ప్రశంసించాలి అంటూ ఈ సందర్భంగా రష్మిక గురించి చాలా పాజిటివ్ గా రక్షిత్ మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.