‘దేవర’ నుండి ఎన్టీఆర్ పిక్స్.. AI ఆర్ట్ తో అదిరిపోయాయిగా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ( Director Koratala Siva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”.ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతుంది.

 ‘దేవర’ నుండి ఎన్టీఆర్ పిక్-TeluguStop.com

స్టార్ట్ చేయడంలో ఆలస్యం అయినప్పటికీ షూటింగ్ కు పెద్దగా గ్యాప్ లేకుండా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి మెయిన్ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేసారు.

ఎన్టీఆర్( NTR ) తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) ఫస్ట్ లుక్స్ రిలీజ్ అవ్వగా ఈ ఫస్ట్ లుక్ లతో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది.ఇదిలా ఉండగా ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట మేకర్స్ షేర్ చేసారు.

ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటూనే మరో వైపు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.

దీనికి సంబంధించి తాజాగా రెండు పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.ప్రజెంట్ ఈ పిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్న సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్ ఈ సినిమా నుండి తాజాగా రెండు పిక్స్ ను ట్విట్టర్ లో షేర్ చేసారు.

AI ఇల్యూషన్ టూల్ తో( AI Illusion Tool ) ఎన్టీఆర్ ముఖాన్ని ఇందులో సృష్టించగా ఈ పిక్స్ తెగ ఆకర్షిస్తున్నాయి.

సముద్రం ఒడ్డున ఉన్న పడవలతో ఈ ఫేస్ ను శ్రీనివాస్ డిజైన్ చేసారు.ఈ అద్భుతమైన పిక్స్ చూసి తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇదిలా ఉండగా మొత్తం 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ను కొరటాల ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తారో వీరి కలయికలో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube