బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో గా ఎదిగిన హీరో ప్రభాస్( Prabhas )…ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు .తాజాగా భారత పౌరాణిక చరిత్ర రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ ( Adipurush movie )లో ప్రభాస్ నటించారు .
ఓం రౌత్( Om Raut ) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సీరిస్ నిర్మిస్తున్నది.

రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు.ఈ చిత్రం జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉంది … ప్రభాస్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందించిన చిత్రంగా తెరకెక్కింది.ఈ సినిమా కోసం ప్రభాస్ సుమారు 150 కోట్ల రెమ్యునరేషన్ అందుకొన్నట్టు తెలుస్తున్నది.
రావణాసురుడిగా నటించిన సైఫ్ ఆలీఖాన్, సీతగా నటించిన కృతి సనన్ కూడా భారీ పారితోషికం అందుకొన్నట్టు సమాచారం.ఇక ఆదిపురుష్ సినిమా భారతీయ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తున్నది.
ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల హక్కులు భారీ ధరకు పీపుల్స్ మీడియా దక్కించుకొన్నట్టు తెలుస్తున్నది.ఈ సినిమా ఏపీ, నైజాం థియేట్రికల్ హక్కులు 180 కోట్ల రూపాయల మేర చెల్లించి సొంతం చేసుకొన్నట్టు సమాచారం.
ఆదిపురుష్ తెలుగేతర రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల అమ్మకం ఇంకా పూర్తి కాలేదని సమాచారం.హిందీ, ఓవర్సీస్‌కు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ గురించి చర్చలు జరుగుతున్నాయి.
మిగితా భాషల హక్కులు 450 కోట్లు మేర జరిగాయనేది ట్రేడ్ వర్గాల్లో టాక్.ఈ రేంజ్‌లో ఆది పురుష్ థియేట్రికల్ బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఆదిపురుష్ నాన్ థియేట్రికల్ హక్కులు కూడా భారీగానే నమోదయ్యయాయి.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ 500 కోట్ల రూపాయలు, శాటిలైట్ హక్కులు 400 కోట్ల రూపాయలు, మ్యూజిక్ రైట్స్ 60 కోట్ల రూపాయలకు అమ్మినట్టు సమాచారం.నాన్ థియేట్రికల్ హక్కులు సుమారు 960 కోట్ల రూపాయల మేర జరిగినట్టు సమాచారం.థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.
ఇప్పటి వరకు జరిగినది 1300 కోట్ల రూపాయలు.హిందీ, ఓవర్సీస్ బిజినెస్ జరిగితే.
మొత్తంగా ఈ సినిమా బిజినెస్ 1800 కోట్ల రూపాయలుగా ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.ఇదే జరిగితే.
ఇటీవల కాలంలో ఈ రేంజ్‌లో బిజినెస్ జరిగినది ఆదిపురుష్ అని.ఇది ప్రభాస్ సరికొత్త చరిత్ర అని అంటున్నారు .