తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఏర్పరచుకున్నారు జగపతి బాబు.మంచి మనషులు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన జగపతి బాబు సింహ స్వప్నం సినిమాతో హీరోగా మారాడు.
కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్లు అందుకున్న జగపతి బాబు ఫ్యామిలీ హీరోగా శోభన్ బాబు తర్వాత అంతటి ఫ్యామిలీ ఇమేజ్ తెచ్చుకున్నాడు.హీరోగా మెప్పించిన ఆయన కెరియర్ లో విలన్ గా కొత్త టర్న్ తీసుకున్నారు.
విలన్ గా జగపతి బాబు కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.
నెగటివ్ రోల్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు జగపతి బాబు.నేడు 60వ వసంతం లోకి అడుగు పెడుతున్న జగపతి బాబు ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు.బర్త్ డే సందర్భంగా తన ఆర్గాన్ డొనేషన్ కు సైన్ చేశారు.
అవయవ దానం అనేది చాలా గొప్ప విషయం.అవయవ దానం చేసేందుకు ఒప్పుకుని రీల్ హీరోనే కాదు రియల్ హీరో అనిపించుకున్నారు జగపతి బాబు.
ప్రస్తుతం సినీ కెరియర్ విలన్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మంచి జోష్ మీద ఉంది.