పునీత్ రాజ్‌కుమార్ మరణం అభిమానులతో పాటు సినీ ప్రముఖులను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.టాప్ హీరోగా కొనసాగుతున్న పునీత్ గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించడంతో కన్నడ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగి పోయింది.
ఈ వార్త విన్న ఆయన అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.పునీత్ పార్ధివదేహం అభిమానుల సందర్శన కోసం కంఠీరవ స్తేడియంలో ఉంచారు.
పునీత్ పార్ధివ దేహాన్ని చివరిసారిగా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నారు.దీంతో అక్కడ తోపులాట జరుగుతుంది.తమ అభిమాన హీరోను చివరిసారి చూసేందుకు లక్షలాది మంది అభిమానులు వస్తున్నారు.పునీత్ అంత్యక్రియలు పూర్తి అయ్యె వరకు ఎలాంటి ఘటనలు జరగకూడదని కర్ణాటక ప్రభుత్వం భారీగా పోలీసులకు మోహరించింది.
ఈ రోజు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి.ప్రభుత్వ లాంఛనాలతో కొద్దీ సేపట్లో సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

పునీత్ అంత్యక్రియల కార్యక్రమాలు రాజ్ కుమార్ స్టూడియోలో జరుగుతున్నాయి.ఇక్కడకు కర్ణాటక ముఖ్య మంత్రి బసవరాజ్ బొమ్మై తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఇక అంత్యక్రియలు జరిగే ముందు ముఖ్యమంత్రి బసవరాజ్ పునీత్ పార్ధివదేహాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు.ఆయన పునీత్ పార్ధివదేహాన్ని కడసారి ముద్దాడి ఆయనకు వీడ్కోలు పలికాడు.రాజ్ కుమార్ స్టూడియోలో పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే పునీత్ అంత్యక్రియలు జరుగుతున్నాయి.ఇక్కడికి కూడా భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.పోలీసుల భద్రత నడుమ పునీత్ అంత్యక్రియలు జరుగుతున్నాయి.